వీరికి వ్యాపారాల్లో లాభాలు

Daily horoscope for 07-02-2023.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on  7 Feb 2023 1:45 AM GMT
వీరికి వ్యాపారాల్లో లాభాలు

మేషం : వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాటపట్టింపులు తప్పవు. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం : సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. అవసరానికి ఇతురుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశలు అందుతాయి.

మిధునం: నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పవు. నేత్ర సంభందిత అనారోగ్యసమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది.దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం:సంతాన విద్యా ఉద్యోగం విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

సింహం: ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య: సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పనులు బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు.

తుల: ఉద్యోగమున చాలా కాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం: ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి.కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

ధనస్సు: వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.నిరుద్యోగులకు అతి కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్నివ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

మకరం: ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కుంభం: బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది.వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

మీనం: నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.దూరప్రాంత బందు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.కీలక సమయంలో మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Next Story