నేటి దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ లాభాలే

Daily horoscope for 06-10-2022. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం ఉన్నది. చాలకాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

By జ్యోత్స్న  Published on  6 Oct 2022 12:56 AM GMT
నేటి దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ లాభాలే

మేషం:

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం ఉన్నది. చాలకాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. భూ వ్యవహారాలలో నూతన లాభాలు అందుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

వృషభం:

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని విషయాలలో కీలకంగా వ్యవహరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు.

మిధునం:

కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపారమున గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగాలలో మార్పులు తప్పవు. దూరప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులుంటాయి.

కర్కాటకం:

ప్రయాణాలు వాయిదా పడుతాయి. బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి, ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

సింహం:

వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కన్య:

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. ఆర్ధిక అనుకూలత కలిగి రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. దైవచింతన పెరుగుతుంది.

తుల:

వ్యాపారమున అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. నూతన రుణయత్నాలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

వృశ్చికం:

ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారమున స్వంత ఆలోచనలు కలసిరావు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన శిరోభాధలు కలిగిస్తాయి.

ధనస్సు:

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

మకరం:

చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చెయ్యవలసిన వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కుంభం:

మొండి బాకీలు వసూలవుతాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

మీనం:

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. దూరప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. దీర్ఘ కాలిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వాతవరణం కొంత గందరగోళంగా ఉంటుంది.

Next Story