దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
Daily horoscope for 06-03-2023. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
By జ్యోత్స్న Published on 6 March 2023 7:07 AM ISTప్రతీకాత్మకచిత్రం
మేషం: వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు అదుపుచేయడం కష్టంగా మారుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలు వివాదాస్పదంగా మారుతాయి.
వృషభం: ధనాదాయ విషయాలలో లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది.
మిధునం: నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి .ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం: చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. సంతాన ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాల వలన ధనవ్యయం కలుగుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది.
సింహం: ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.
కన్య: నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి .ధన పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబమున అనిశ్చిత కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారములలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు.
తుల: వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి.
వృశ్చికం: వ్యాపార పరంగా అభివృద్ధి సాధిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ధనస్సు: ఉద్యోగస్థులకు ఊహించని స్థాన చలనాలుంటాయి. ఇతరులతో నిదానంగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.
మకరం: బంధుమిత్రులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు ఉండవు . ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
కుంభం: సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తికి సంభందిత వివాదాలలో విజయం సాధిస్తారు.
మీనం: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో దీర్ఘకాలిక వివాదాలను రాజి చేసుకుంటారు. ధనాదాయం బాగుంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.