దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్ని పనుల్లో సత్ఫలితాలే

Daily horoscope for 06-02-2023. మేషం: ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు

By జ్యోత్స్న  Published on  6 Feb 2023 1:22 AM GMT
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్ని పనుల్లో సత్ఫలితాలే

మేషం: ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మతాపట్టింపులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృషభం: వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశలు అందుతాయి. అవసరానికి ఇతురుల నుండి ధన సహాయం అందుతుంది. సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.

మిధునం: నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది.

కర్కాటకం: వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి కలుగుతుంది.

సింహం: ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.

కన్య: బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. గృహమున శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.

తుల: ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున చాలా కాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

వృశ్చికం: కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది.

ధనస్సు: నిరుద్యోగులకు అధిక కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

మకరం: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసి వస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కుంభం: వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది.

మీనం: ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల బందు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

Next Story