వీరు ఆర్థికంగా పుంజుకుంటారు
Daily horoscope for 05-01-2023.చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి
By జ్యోత్స్న Published on 4 Jan 2023 11:15 PM GMTమేషం: చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది.
వృషభం: ముఖ్యమైన వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్త్రీ సంబంధిత సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారమున అవరోధాలు తప్పవు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మిధునం:వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతి వ్యవహారాన్ని పెద్దలతో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం: బంధుమిత్రుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాలలో ఎంత శ్రమపడిన ఫలితం అంతగా కనిపించదు.
సింహం: ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.
కన్య: వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంతాన విద్య విషయాలలో మరింత కష్ట పడవలసి వస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికి నిదానంగా పూర్తవుతాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చే విషయంలో పునరాలోచన చేయుటం మంచిది.
తుల: స్థిరస్తి క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూరప్రాంత బంధు మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
వృశ్చికం: దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించటం మంచిది. నిరుద్యోగులు లభించిన అవకాశాలను చేజారకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి.
ధనస్సు: కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. భాగస్వామ్య వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వాహన ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.
మకరం: బంధు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి కొన్ని రంగాల వారికి చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.
కుంభం: ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రు సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఉద్యోగమున ఇతరులతో జాగ్రత్తగా వ్యవహారించాలి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం: దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు కలసివస్తాయి.