వీరికి ఆక‌స్మిక ధ‌న‌లాభం

Daily horoscope for 04-02-2023.శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.

By జ్యోత్స్న  Published on  4 Feb 2023 7:14 AM IST
వీరికి ఆక‌స్మిక ధ‌న‌లాభం

మేషం: శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. బంధువర్గంతో చిన్న పాటి వివాదాలు తప్పవు. వ్యాపారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

వృషభం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభాసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది.

మిధునం: వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి. చేతిలో డబ్బు నిలువ ఉండక నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.

కర్కాటకం: వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.

సింహం: మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు కొంత మానసికంగా కలచివేస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

కన్య : వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సంతాన వివాహయత్నాలు సానుకూలమౌతాయి. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

తుల : నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటాబయట మీ నిర్ణయాలు అందరు గౌరవిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వృశ్చికం : భాగస్థులతో ఒప్పందాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

ధనస్సు : ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఇబ్బందులు తప్పవు. బంధువులతో మాటపట్టింపులుంటాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

మకరం : వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహనయోగం ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది.

కుంభం : ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. సోదరులతో కలహా సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మీనం: ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలున్నవి. వ్యాపారాలు అంతంతా మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. స్థిరస్తి కొనుగోలులో ఆటంకాలు ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Next Story