వీరికి ఉద్యోగాల‌లో ఇబ్బందులు త‌ప్ప‌వు

Daily horoscope for 04-01-2023.భాగస్వామ్య వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

By జ్యోత్స్న  Published on  4 Jan 2023 5:00 AM IST
వీరికి ఉద్యోగాల‌లో ఇబ్బందులు త‌ప్ప‌వు

మేషం : భాగస్వామ్య వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. దూరప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

వృషభం : నూతన వాహన సౌక్యం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిధునం : చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ కష్టం ఫలించదు.

కర్కాటకం :ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్నిహితులు, వివాదాలు సర్దుబాటు కాగలవు.

సింహం : ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.

కన్య:వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలతో భారంగా మారతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి.

తుల : ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని పనులలో రెండు రకములైన ఆలోచనలతో నష్టాలు తప్పవు.

వృశ్చికం : వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ధనస్సు : నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

మకరం : వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆస్థి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కుంభం : ఒక విషయంలో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు. ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి.

మీనం : నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

Next Story