దిన ఫలాలు.. నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు

Daily horoscope for 02-01-2023. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా

By జ్యోత్స్న  Published on  2 Jan 2023 1:18 AM GMT
దిన ఫలాలు.. నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు

మేషం: ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగమున మార్పులు ఉంటాయి ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

మిధునం: ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి.

కర్కాటకం : సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

సింహం : వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

కన్య : ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవచింతన పెరుగుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు.

తుల : ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.

వృశ్చికం: ఆస్తి వివాదాలు తొలగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక సమయంలో ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి.

ధనస్సు: ప్రముఖులతో సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి.సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషానిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

మకరం : చిన్నపాటి అనారోగ్యాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి నూతన రుణయత్నాలు సాగిస్తారు దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

కుంభం : కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

మీనం: ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరస్తి వివాదాలలో బయటపడటానికి ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

Next Story