ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 1:59 AM GMTమేషం : చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.
వృషభం : ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి.
మిధునం : వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కారమౌతాయి. చేపట్టిన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు.
కర్కాటకం : ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు తప్పవు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
సింహం : గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ సభ, సమావేశాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.
కన్య : సన్నిహితులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల : దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణయత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి.
వృశ్చికం : వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దైవ సేవా సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి.
ధనస్సు : పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో ఊహించని మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
మకరం : ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.
కుంభం : ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు ఒత్తిడితో కానీ పూర్తి కావు. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. మొండి బాకీలు కొన్ని వసూలవుతాయి.
మీనం : ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చిన్న పాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున నత్తనడకన సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.