వీరి ఆర్థిక స్థితి మెరుగుప‌డుతుంది

విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు.

By జ్యోత్స్న  Published on  7 March 2023 1:47 AM GMT
Daily horoscope,Horoscope,Dina phalalu,Rasi Phalalu

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

మేషం : విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతాన విషయంలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి

వృషభం : చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.ఆర్ధిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయం లభించదు.

మిధునం : వ్యాపారపరంగా స్థిరమైన లాభాలు అందుకుంటారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దీర్ఘ కాలిక ఋణాల నుండి ఊరట పొందుతారు. ఇంటాబయట కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి.

కర్కాటకం : కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలుభాదిస్తాయి. వృత్తి,ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి అకారణంగా ఇతరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

సింహం :నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గృహమున శుకార్యములు నిర్వహిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య : సమయానికి నిద్రాహారాలు ఉండవు. వృధా ఖర్చుల విషయంలో ఆలోచించి ముందుకు ముందుకు సాగాలి. వ్యాపార పరంగా స్వలప ధన నష్ట సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి కావల్సి వస్తుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

తుల : అవసరానికి ఆప్తుల నుండి ధన సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయట గౌరవమర్యాదలు పెరుగుతాయి.

వృశ్చికం : కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి వ్యాపారాలలో కుటుంబ పెద్దల ఆలోచనలు కలసివస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు : వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసికంగా కలచివేస్తాయి.

మకరం : వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో చేయని పనికి నిందలు పడవలసి వస్తుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వ్యాపారపరంగా ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

కుంభం : పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కీలక సమయంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. నూతన గృహ వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.

మీనం : స్ధిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది.

Next Story