దిన ఫలాలు: నేడు ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి..
మేషం: ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
By జ్యోత్స్న Published on 20 March 2023 1:31 AM GMTదిన ఫలాలు: నేడు ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి..
మేషం: ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు దీర్ఘకాలిక రుణాలు నుండి విముక్తి కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.
వృషభం: ఉద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్థిర నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో స్వంత ఆలోచనలతో ముందుకు సాగుతారు.
మిధునం: దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంతానంతో అకారణ కలహాలు కలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఋణ ఒత్తిడి వలన శిరోభాధలు తప్పవు. శ్రమాధిక్యతతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కర్కాటకం: మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సింహం: అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.
కన్య: బంధు మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.
తుల: ఉద్యోగమున బాధ్యతలు సరిగా నిర్వహించలేరు. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసిరావు.
వృశ్చికం: అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ధనస్సు: అన్ని వైపుల నుండి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుండి ఊహించని ధన సహాయం అందుతాయి.
మకరం: ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇతరుల నుండి ఊహించని విమర్శలు కలుగుతాయి. వృత్తి బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
కుంభం: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. సంతానం విద్యా విషయాల సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
మీనం: ఇంటా బయట కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వృధా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కావు.