దిన ఫలితాలు: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 6:16 AM ISTదిన ఫలితాలు: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు
మేషం:
అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభం:
ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
మిధునం:
చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం:
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. కుటుంబ విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
సింహం:
కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. గృహనిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.
కన్య:
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత రాణిస్తారు.
తుల:
వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు జరుగుతాయి. ఇంటాబయట కొందరు ప్రవర్తన మానసిక చికాకు కeలిగిస్తుంది. బంధువర్గం నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
వృశ్చికం:
ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అవసరానికి ధనసహాయం లభిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి.
ధనస్సు:
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. నూతన రుణయత్నాలు చేస్తారు. వ్యాపార విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
మకరం:
స్నేహితులతో మాటపట్టింపులు ఉంటాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంతమందికోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
కుంభం:
చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగకోడిగా సాగుతాయి.
మీనం:
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధన పరంగా చికాకులు తొలగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి. వ్యాపారమున అనుకూలత కలుగుతుంది.నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.