చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు, ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.

By జ్యోత్స్న  Published on  14 March 2023 1:30 AM GMT
Daily horoscope,Horoscope,Dina phalalu,Rasi Phalalu

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

మేషం : ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ స్థానచలన సూచనలున్నవి.

వృషభం : వ్యాపారమున పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. దైవదర్శనాలు చేయనుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మిధునం : ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం : బందు వర్గంతో వివాదాలుంటాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి.

సింహం : స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఇంటాబయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆకస్మిక ప్రయాణా సూచనలున్నవి.

కన్య : వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

తుల : దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత చికాకు పరుస్తాయి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి.

వృశ్చికం : పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

ధనస్సు : వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు వర్గం నుంచి ధన పరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమౌతారు.

మకరం : వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తొలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం అందుతుంది.

కుంభం : ఉద్యోగులు నూతనోత్సాహం పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

మీనం : వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ధనదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.

Next Story