దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

By జ్యోత్స్న  Published on  10 April 2023 1:26 AM GMT
Daily horoscope, astrology, Rasiphalalu

దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు

మేషం: వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభం: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాల్లో అభివృద్ధి బాటలో పయనిస్థాయి. దైవదర్శనం చేసుకుంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

మిధునం: ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల వారినుండి శుభవార్తలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

కర్కాటకం: దూరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి.

సింహం: వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇంటా బయట చికాకులు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు వివరాలు పనిభారం తప్పదు.

కన్య: సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభం పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

తుల: స్ధిరాస్తి సంబంధిత నూతన ఒప్పందాలు వాయిదాపడతాయి. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు అంతగా కలిసిరావు.

వృశ్చికం: కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు: బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి ధనం అందక ఇబ్బంది పడతారు.

మకరం: సంఘంలో పెద్దలతో చర్చలు లాభసాటిగా ఉంటాయి. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఋణ సంబంధిత ఇబ్బందుల నుంచి బయట పడతారు.

కుంభం: ధన పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.

మీనం: ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. శిరోబాధలు పెరుగుతాయి.

Next Story