వీరికి అదృష్ట‌యోగ‌ముంది

బంధు మిత్రులతో అకారణ కలహలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి

By జ్యోత్స్న  Published on  3 March 2023 1:38 AM GMT
Daily horoscope,Horoscope,Dina phalalu,Rasi Phalalu

దిన ఫ‌లాలు

మేషం : బంధు మిత్రులతో అకారణ కలహలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మాతృ వర్గ బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.

వృషభం : గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత మేలైన సౌకర్యాలుంటాయి. చిన్ననాటి మిత్రులతో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి.

మిధునం : సంతాన విద్యా విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితులతో ఒక వ్యవహారంలో మనస్పర్దలు కలుగతాయి.

కర్కాటకం : బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఇంటాబయట సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

సింహం : నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. సకాలంలో పనులు పూర్తికాక చికాకులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య: అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వ్యాపారములలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు.

తుల : వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. దూరప్రాంత బంధువుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

వృశ్చికం : ముఖ్యమైన పనులలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలు గందరగోళ పరిస్థితులుంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొనటం మంచిది. ఆదాయానికి ఇబ్బందులు తప్పవు నూతన ఋణయత్నాలు నిదానంగా సాగుతాయి.

ధనస్సు : మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికామౌతాయి.

మకరం : సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మరింత సానుకూలంగా సాగుతాయి.

కుంభం : ధన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.

మీనం : నిరుద్యోగుల కష్టం ఫలించదు. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

Next Story