ఆ రాశుల వారు వివాదాల‌కు దూరంగా ఉండాలి

వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు

By జ్యోత్స్న  Published on  2 March 2023 1:52 AM GMT
Daily horoscope,Horoscope,Dina phalalu,Rasi Phalalu

నేటి దిన‌ఫ‌లాలు

మేషం : మేషం:వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధన వ్యవహారాలు కలసివస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగపరంగా అధిక చర్చలు సఫలం అవుతాయి.

వృషభం : వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆప్తులతో విభేదాలు చికాకు పరుస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఋణ ప్రయత్నాలు ఫలించవు వృధా ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది.

మిధునం : సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది.

కర్కాటకం : వ్యాపారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక నష్టపడతారు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఋణ భారం అధికమౌతుంది.

సింహం : వృత్తి వ్యాపారాలలో శ్రమ ఫలించి నూతన లాభాలు పొందుతారు. స్థిరాస్తి ఒప్పందాలు కలసి వస్తాయి దీర్ఘకాలిక రుణాల తొలగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

కన్య: ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.నిరుద్యోగులకు నూతన అవకాశాలు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున ఉన్నత కలుగుతుంది.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల : వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం : ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి.అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.

ధనస్సు : వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగముల ఉత్సాహకర వాతావరణం ఉంటుంది స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది.

మకరం : వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది ఆకస్మిక ధన వస్తులాభాలు పొందుతారు.

కుంభం : వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభించవు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి నిరుద్యోగులకు నిరాశ తప్పదు వృధా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది సన్నిహితులతో ధన వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి.

మీనం : బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి

Next Story