వార ఫలాలు 16-05-2021 నుండి 22-05-2021 వరకు

Astrology of May third week.వార ఫలాలు 16-05-2021 నుండి 22-05-2021 వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 May 2021 8:26 AM IST
astrology
మేష రాశి:

చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలు సర్దుమణుగుతాయి. మిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబం లో జరిగే ఒక సంఘటన మీ ఆలోచనలు విధానం మారుస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో విస్తరణ నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగస్తుల శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. అన్ని రంగాలవారికి అనుకూలత కలుగుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలున్నవి. పనులు వాయిదా పడతాయి.

పరిహారం : ఆదిత్యహృదయం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృషభ రాశి:

ఇంట బయట పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తుల వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మరింత సఖ్యతగా కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి చిన్నతరహా పరిశ్రమలకు ఊహించని అవకాశాలు అందుతాయి. వారం చివరన స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి.

పరిహారం : ఆంజనేయస్వామి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి:

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి దీర్ఘకాలిక ఒత్తిడి నుండి దైర్యంగా బయట పడతారు.స్ధిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాట విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను తెలివిగా రాజీ చేసుకుంటారు. ఉద్యోగమున ఉన్నత అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇతరులకు హామీగా ఉండే విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

పరిహారం : లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి:

ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.మంచి ప్రవర్తనతో సమాజంలో పెద్దలను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలు మరింత సంతృప్తికరంగా సాగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మానానికి డబ్బులు సమకూరుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో సోదరులతో వివాదాలుఉంటాయి ఇంట బయట చికాకులు తప్పవు.

పరిహారం : దేవి ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

సింహ రాశి:

చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. కుటుంబ పెద్దలతో ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు వేగవంతం చేస్తారు. ధన వ్యవహారాలలో అడ్డంకులు తొలగుతాయి.భూ సంభందిత క్రయవిక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల మెప్పు పొందుతారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశములు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. అనుకున్న వ్యవహారాలు ఆలోచనలు కలసిరావు. కుటుంబ విషయాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.

పరిహారం : సుబ్రమణ్య భుజంగ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కన్య రాశి:

ఆర్ధిక సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలలోసన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి ఆప్తుల నుండి అందిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి సోదరులతో స్ధిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు చేస్తారు. సమాజంలో విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలలో గతంలో కంటే మంచి లాభాలు అందుకుంటారు. వారసత్వపు ఆస్తుల విషయంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యల నుంచి బయట పడతారు. వారం మధ్యలో డబ్బు విషయమై ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబమున స్వల్ప వివాదాలు ఉంటాయి.

పరిహారం : లక్ష్మి దేవి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి:

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు కొంత సర్దుబాటు అవుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. గృహ నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అవాంతరాలు తొలగుతాయి.నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని స్థాన చలన సూచనలు ఉంటాయి.నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. కొన్ని రంగాల వారికి కీలక సమాచారం అందుతుంది. వారం చివరిలో కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

పరిహారం : నవగ్రహారాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చికం రాశి:

అవసరానికి ధన సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో బంధు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి.

పరిహారం : శివారాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధను రాశి:

ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులలో సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు.ధనాదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో తెలివితేటలతో మంచి లాభాలు అందుకుంటారు సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపుపనిభారం నుండి కొంతఊరట లభిస్తుంది. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది వారం మధ్యలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా లోటుపాట్లు ఉంటాయి.

పరిహారం : గణపతిని ఆరాధించడం వలన శుభఫలితాలు పొందుతారు.

మకర రాశి:

వృత్తి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు వ్యాపారాలు గతంలో కంటే మరింత పుంజుకుని లాభాలు అందుతాయి. ఇంటా బయట మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. గృహనిర్మాణ పనులలో పురోగతి కలుగుతుంది చేపట్టిన పనుల్లో మిత్రుల సహాయంతో విజయం సాధిస్తారు అవసరాలకు తగిన విధంగా ధనం సమకూరుతుంది. స్థిరాస్తి విక్రయాలలో అవరోధాలు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. నిరుద్యోగులకు అంచనాలను అందుకుంటారు సంతానం విద్యావిషయాలు అనుకూలిస్తాయి. వారంప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకోని కుటుంబ కలహాలు ఉంటాయి.

పరిహారం : విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి:

పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టాలు తప్పవు. బంధువులతో ఊహించని కలహాలు కలుగుతాయి. ఉద్యోగ విషయంలో సమస్యను సద్దుమణిగి కొంత ఊరట కలుగుతుంది. కొన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వారం చివరన బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

పరిహారం : మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి:

అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఆత్మీయులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. తగిన ప్రణాళిక రూపొందించి కీలక వ్యవహారాలలో విజయం సాదిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. విలువైన వస్త్రా, ఆభరణాలుకొనుగోలుచేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతంచేస్తారు. వృత్తి, వ్యాపారాలుఅనుకూలంగా సాగుతాయి ఉద్యోగ విషయమై అధికారులు సహాయంతో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలత కలుగుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాహన ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారం : గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story