వార ఫలాలు 05-09-2021నుండి 11- 09-2021 వరకు

Astrology from September 5th to 11th.వార ఫలాలు 05-09-2021నుండి 11- 09-2021 వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Sept 2021 7:47 AM IST
వార ఫలాలు 05-09-2021నుండి 11- 09-2021 వరకు

మేష రాశి :

చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఉన్న అవసరానికి ధనం అందుతుంది. దూరపు బంధువులతో కీలక విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి సోదరులతో స్థిరాస్తి వివాదాలకు సంభందించి ఒప్పందాలు వాయిదా పడుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి నూతన వాహనాలు కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీరు ఆశించిన స్థానచలనాలు ఉంటాయి వారం మధ్యలో కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.

పరిహారం: గణేష స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృషభ రాశి :

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సమస్యలను ఓర్పుతో గట్టెక్కుతారు. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మీ ఉన్నతిని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వారం చివరిలో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ ఒత్తిడులు చికాకు కలిగిస్తాయి.

పరిహారం: దేవీఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి :

శ్రమాధిక్యతతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలున్నవి. బంధువర్గం వారు మీతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించక నిరాశపడతారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా అవసరానికి కొంత సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు చిన్నతరహా పరిశ్రమల వారికీ మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభకార్యా ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది.

పరిహారం: ఆదిత్య హృదయం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కర్కాటకం రాశి :

ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. స్ధిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరంగా గందరగోళ పరిస్థితి నుంచి కొంత వరకు బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. శత్రువులు కుడా మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఊహించని మార్పులు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం: విష్ణుసహస్రనామ పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి :

చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహనయోగం ఉన్నది. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో ధైర్యంతో కొన్ని వివాదాలు నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఆశించిన అవకాశములు అందుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. గృహమున శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమౌతాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.

పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కన్య రాశి :

ఆర్థిక విషయాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయట పడతారు. సన్నిహితులు నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలను ఓర్పుతో పరిష్కరించుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహన వ్యాపారస్తులకు నూతన అవకాశములు లభిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తార. నిరుద్యోగులు కలలు సాకారమౌతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్ధిరాస్తి విషయంలో విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

పరిహారం: శివసహస్ర నామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి :

ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు చేస్తారు స్ధిరాస్తి విషయంలో సోదరులతో వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడులు కొంత ఆలస్యమౌతాయి. వారం చివరిలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన, వస్తు వాహన లాభాలు ఉంటాయి.

పరిహారం: నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృశ్చికం రాశి :

చేపట్టిన పనులలో కొంత జాప్యం తప్పదు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం అందుకోలేరు. సోదరులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన చికాకులు పెరుగుతాయి. భూ క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూరపు బంధువులను ఆగమనం కొంత ఆనందం కలిగిస్తుంది. మీ అభిప్రాయాలపై కుటుంబ సభ్యుల నుండి సానుకూల స్పందన వస్తుంది. చిన్నతరహా పరిశ్రమలకు గందరగోళ పరిస్థితులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో సహచరులతో మాటపట్టింపులుంటాయి. వారం ప్రారంభంలో దీర్ఘకాలిక వివాదాల పరిష్కారం అవుతాయి ఆకస్మిక ధనప్రాప్తి.

పరిహారం: సుబ్రమణ్యస్వామి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి :

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టినా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి విలువైన విషయాలు సేకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పాతవిషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన గృహ వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగమున అదనపు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. వారం చివరిలో స్వల్ప ధనవ్యయ సూచనలున్నవి దూర ప్రయాణాలు వలన విశ్రాంతి ఉండదు.

పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మకర రాశి :

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత ఋణాలు తీరుస్తారు. మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సోదరులతో మరింత సఖ్యత వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుని ద్వారా అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి బయటపడతారు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత కష్టం మీద పూర్తవుతాయి వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిది పెరుగుతుంది.

పరిహారం: రామ రక్ష స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభ రాశి :

ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్ప ఫలితం ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధుమిత్రుల నుంచి ఊహించని ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతాన విద్యా ఫలితాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలలో యుక్తిగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులుంటాయి. వారం చివరిలో వివాహ శుభకార్యాలలో పాల్గొంటారు.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

పరిహారం: నవగ్రహస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలుంటాయి.

మీన రాశి :

బంధు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. పనుల్లో అవరోధాలు తప్పవు . ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో కొన్ని నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు చేసుకుంటారు. నిరుద్యోగులకు ఒక వార్త ఊరటనిస్తుంది. శుభకార్యాలు వాయిదా పడుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు కొంత వేధిస్తాయి. అన్ని రంగాల వారికీ గృహమున ఒత్తిడులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో నూతన వాహనయోగం ఉన్నది. సంఘములో పెద్దలతో చర్చలు ఫలిస్తాయి.

పరిహారం: కనకధారా స్తోత్రం పారాయణం చెయ్యడం. వలన శుభఫలితాలు.

Next Story