వారఫలాలు తేది 04-09-2022 నుండి 10-09-2022 వరకు

Astrology from September 4th to 10th.వారఫలాలు తేది 04-09-2022 నుండి 10-09-2022 వరకు

By జ్యోత్స్న  Published on  4 Sep 2022 1:51 AM GMT
వారఫలాలు తేది 04-09-2022 నుండి 10-09-2022 వరకు

మేష రాశి : నూతన వాహనాలు, స్తిరస్థులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఇంటా బయట ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. గృహంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. పాత బాకీలు వసూలవుతాయి. అన్నిరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో విలువ పెరుగుతుంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఒత్తిడులు అదిగమించి లాభాలు అందుకుంటారు.

పరిహారం : అర్ధనారిశ్వర అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి : చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. వ్యాపారాలలొ నూతన లాభాలు అందుకుంటారు. సంతాన విద్యా విషయాలు సానుకూలంగా సాగుతాయి ఆప్తుల శుభకార్యాలకు బంధువులతో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయంలో ఆకస్మికంగా నిర్ణయాలలో మార్చుకుంటారు. వారం ప్రారంభంలో ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

పరిహారం : మేధోదక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి : గృహమున శుభకర్యాలు నిర్వహిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలొ పెట్టిన పెట్టుబడులలొ పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు పొందుతారు. వారం మధ్యలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. రాజకీయవర్గాలకు అరుదైన అవకాశములు అందుతాయి.

పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని రంగాల వారికి ఒత్తిడులు తప్పవు. ఇంటాబయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత చికాకు తప్పవు. వారం మధ్యలో దూరపు బంధువులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులకు శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. గృహ, వాహన కొనుగోలు యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి. ఆకస్మిక ధన, వస్తు లాభాలు. అందుతాయి.

పరిహారం : గణేష కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

సింహ రాశి : వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వారం చివరిలో బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : కామాక్షి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కన్య రాశి : అన్నిరంగాల వారికి సమస్యలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ శుభకార్యాలపై చర్చలు సఫలమౌతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్త్ర , ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలోనూతన హోదాలు పొందుతారు. పాత విషయాలు జ్ఞప్తికి వచ్చి బాధిస్తాయి. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారం : రామాష్టకం పారాయణ చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల రాశి : నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు అదిగమిస్తారు. బంధువులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు దక్కుతాయి. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో వివాదాలు కలుగుతాయి.

పరిహారం : కనకధారస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : దైవ దర్శనాలు చేసుకుంటారు .కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడుతాయి. సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబమున వివాదాలు చికాకులు పరుస్తాయి. బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చాలకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు పరిష్కారమౌతాయి. చిన్నతరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

పరిహారం : విష్ణు పంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గృహ కొనుగోలు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి సాధిస్తారు. విద్యార్థులు ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో భాగస్వాముల సహాయంతో విస్తరిస్తారు. ఉద్యోగస్థులకు సంతోషకరమైన వార్తలు తెలుస్తాయి. అన్నిరంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మానసిక సమస్యలు బాధిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. కుటుంబంలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి.

పరిహారం : దత్తపంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి : నిరుద్యోగులకు నూతనోత్సాహంతో అవకాశములు అందుకుంటారు. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సాయం అందుతుంది. మిత్రుల నుంచి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. గృహ, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగమున కొన్ని వివాదాలు అత్యంత తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యాలు బాధిస్తాయి. అన్ని రంగాలవారి అంచనాలు నిజం కాగలవు.

పరిహారం : హయగ్రీవస్తోత్రం పారాయణం చెయ్యడంవలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.దాయదులతో వివాదాలు కొలిక్కి వస్తాయి.ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తాయి. బంధు మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలొ ఊహించిన దాని కంటే అధిక లాభాలు పొందుతారు. దూరప్రాంతాల మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో బంధువులతో మాటపట్టింపులు మానసిక అశాంతి కలిగిస్తాయి. కొన్ని రంగాల వారికి అనుకోని సంఘటనలు ఎదురావుతాయి. ధనపరమైన ఇబ్బందులు ఉంటాయి.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు శుభ ఫలితాలు పొందుతారు.

మీన రాశి : నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.సన్నిహితులతో వివాదాలను పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారు పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. శుభకార్యలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా విస్తరిస్తారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వారం చివరిలో అనుకోని ఖర్చులు ఉంటాయి.

పరిహారం : వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Next Story