వార ఫలాలు తేది 25-09-22 నుంచి 01-10-22 వరకు
Astrology from September 25th to October 1st.వారం ప్రారంభంలో చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు.
By జ్యోత్స్న Published on 25 Sep 2022 1:58 AM GMTమేష రాశి : వారం ప్రారంభంలో చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు. కొన్ని విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. నూతనోత్సాహంతో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పుణ్యక్షేత్రములు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. అన్ని రంగాల వారికి అప్రయత్నంగా అవకాశములు అందుతాయి.
పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
వృషభ రాశి : నూతన వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి క్రమ క్రమంగా మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. వారం చివరిలో వృధాఖర్చులు. కుటుంబంలో అకారణ వివాదాలు తప్పవు. సంఘంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. విలువైన వస్తులాభాలు పొందుతారు.
పరిహారం : విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మిథున రాశి : ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు అందుకుంటారు. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తెలివిగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దాయాదులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి బంధువులతో చిన్నపాటి విభేదాలు. విద్యార్థులు అంచనాలు అందుకుంటారు. ఉద్యోగాలలో విధులు ఉత్సాహంగా నిర్వర్తిస్తారు.
పరిహారం : శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి : దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తుల కొనుగోలులో ముందడుగు వేస్తారు. మిత్రుల చేయూతతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. కళారంగం వారికి నూతనోత్సాహం. ధనవ్యయం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
పరిహారం : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహ రాశి : పాతసంఘటనలు గుర్తుకు వస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త అవసరం విద్యార్థులు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంటాబయట ఒత్తిడులు తప్పవు. ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నూతన వాహన యోగం ఉన్నది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని రంగాల వారికి చిక్కులు తప్పవు.
పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
కన్య రాశి : గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. బంధు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులుంటాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు నూతన అవకాశములు అందుతాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు ఉంటాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. వారం చివరిలో ఆర్ధిక ఇబ్బందులు తప్పవు.
పరిహారం : దేవిఖడ్గమాలా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
తుల రాశి : ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. మిత్రులు సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో పనులలో శ్రమ అధికమౌతుంది. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు.
పరిహారం : గురుచరిత్ర పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి : ప్రయణాలలో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వారం చివరిలో మిత్రులతో కలహా సూచనలున్నవి.
పరిహారం : సుబ్రహ్మణ్యష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
ధనస్సు రాశి : సంతాన విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఊహించని ఖర్చులు పెరుగుతాయి. బందువులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఉద్యోగాలలో ఎంతటి వారినైనా మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.
పరిహారం : ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మకర రాశి : వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో పనులలో వ్యయప్రయాసలు తప్పవు. బంధువుల నుంచి అందిన కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలలో అవరోధాలు తొలగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలిస్తాయి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన గృహ వాహన కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. అన్ని రంగాల వారికి నూతన అవకాశములు దక్కుతాయి.
పరిహారం : కనకధారా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కుంభ రాశి : స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పవు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. మిత్రులతో అకారణ కలహ సూచనలున్నవి. ఇంటా బయట సమస్యలు తొలగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి తొలగుతుంది. అన్ని వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప దన వ్యయ సూచనలున్నవి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి నూతన లాభాలు అందుకుంటారు. ఇంటా బయట బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తారు.
పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయించాలి.
మీన రాశి : దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకువస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలున్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు కష్టం ఫలిస్తుంది. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. గృహమున వివాదాలు తప్పవు వారం మధ్యలో ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.
పరిహారం : మధురాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.