వార ఫలాలు 12-09-2021 నుంచి 18-09-2021 వరకు

Astrology from September 12th to 18th.వార ఫలాలు 12-09-2021 నుంచి 18-09-2021 వరకు

By జ్యోత్స్న  Published on  12 Sep 2021 2:58 AM GMT
వార ఫలాలు 12-09-2021 నుంచి 18-09-2021 వరకు

మేషం రాశి:

ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి దీర్ఘకాలిక రుణ భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగడం మంచిది. గృహమున కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించి ధైర్యంగా ముందుకు సాగుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. చిన్న తరహా పరిశ్రమలకు మరింత పురోగతి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో చిన్నపాటి అనారోగ్య సూచనలు ఉన్నవి.

పరిహారం : మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభం రాశి:

ముఖ్యమైన వ్యవహారాలలో లోటుపాట్లను అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు చాలా కాలంగా పడుతున్న శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలసి వస్తాయి వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో మాటపడవలసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొన్ని రంగాల వారికి దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. వారం మధ్యలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. గృహమున కొన్ని పరిస్థితులు మానసిక అశాంతిని కలిగిస్తాయి.

పరిహారం : హయగ్రీవ స్వామి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథునం రాశి:

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. నిరుద్యోగులకు మరింత కష్టం తో గాని నూతన అవకాశాలు లభించవు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనసహాయం లభించదు.ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశాజనకంగా ఉండి నూతన రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సామాన్యంగా ఉంటుంది కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాలు చేజారుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

పరిహారం : లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటకం రాశి:

చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట అందరితోనూ నిదానంగా వ్యవహరిస్తారు కొన్ని వ్యవహారాలలో యుక్తిగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకుంటారు.ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు దూరపు బంధువుల నుండి అందిన సమాచారం తో మీ నిర్ణయాలు మార్చుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపారాలు విస్తరించి లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలు అందుతాయి అన్ని రంగాల వారికి ఉత్సాహవంతమైన కాలం. వారం చివరిలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.పెద్దల ఆరోగ్య విషయంలో సమస్యలు తప్పవు.

పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహం రాశి:

సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది. సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి దీర్ఘకాలిక సమస్యలు నుండి బయటపడతారు కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు వారం ప్రారంభంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.

పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన విశేషమైన ఫలితాలు పొందుతారు.

కన్య రాశి:

ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి పూర్తిచేయగలుగుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. సోదరులతో ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి నూతన ఒప్పందాలు చేసుకుంటారు నూతన గృహ, వాహనయోగాలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నతికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. విద్యాపరమైన అనుకూలత కలుగుతుంది.

పరిహారం : పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి:

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. సంఘములో మీ. మాటకు విలువ పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు ఆప్తుల సహాయంతో పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడి అవసరాలు తీరతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల ఫలితాలుంటాయి. విద్యార్థులు శుభవార్తలు అందుకుంటారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో రుణదాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఊహించని ధనవ్యయ సూచనలున్నవి.

పరిహారం : హనుమాన్ చాలీసాపారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృశ్చికం రాశి:

క్రమక్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయి గృహమున బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసివస్తాయి. దాయాదులతో ఆస్తి వివాదాల రాజి చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో చాలకాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అసజానాకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహవంతమైన కాలం. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులుంటాయి.

పరిహారం : స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి రామ రక్షా స్తోత్రం పారాయణం చెయ్యాలి.

ధనస్సు రాశి:

చేపట్టిన పనులు కొంత జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహారిస్తారు. దైవ సేవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తులు పరిచయమై సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘ కాలిక సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని రంగాల వారు నూతనోత్సాహం అనుకున్న పనులు పూర్తి చేస్తారు వారం ప్రారంభంలో బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మకరం రాశి:

నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఒక వ్యవహారంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతానం ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.వ్యాపారాలు క్రమక్రమంగా పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు నుండి బయటపడతారు. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభం రాశి:

దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నూతన గృహ నిర్మాణ విషయమై మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలనాలు కలుగుతాయి. వారం చివరిలో బంధువులతో వివాదాలు కలుగుతాయి. పనులలో శ్రమ పెరుగుతుంది.

పరిహారం : సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మీనం రాశి:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులతో గృహమున సందడిగా గడుపుతారు సన్నిహితుల నుండి ధన సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక విషయాలలో మరింత అభివృద్ధి సాధిస్తారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. ఆలయాలు దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారములలో నూతన వ్యూహాలతో ముందుకు సాగి అనుకున్న అంచనాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థత చాటుకుంటారు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగ సూచనలున్నవి మిత్రులతో కలహా సూచనలున్నవి.

పరిహారం : గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story