వార ఫలాలు తేది 30-10-22 నుంచి 5-11-22 వరకు
Astrology From October 30th to November 5th.పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. అన్నిరంగాల వారికి అనుకూల సమయం.
By జ్యోత్స్న Published on 30 Oct 2022 1:39 AM GMTమేష రాశి :పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. అన్నిరంగాల వారికి అనుకూల సమయం. కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి.
పరిహారం : లక్ష్మీ నృసింహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
వృషభ రాశి : గృహ నిర్మాణ ఆలోచనలలో అవాంతరాలు తొలగుతాయి. బంధువులతో విభేదాలు తప్పవు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేచి చూస్తున్న ఆశయాలు నెరవేరతాయి. ఇంటాబయట మీదే పైచేయి అవుతుంది. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో మరింత లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశములు అందుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వారం ప్రారంభంలో రుణఒత్తిడులు అధికమౌతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషానిస్తుంది.
పరిహారం :హనుమాన్ బడబానల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
మిథున రాశి : పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. ప్రముఖుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. వారం చివరిలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. చిన్నతరహా పరిశ్రమలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి.
పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి : ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. వారం ప్రారంభంలో ఆకస్మిక ధనాప్రాప్తి.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మిత్రులతో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందకోడీగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తప్పవు. కొన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఇంటాబయట సమస్యలు అధిగమవుతాయి.
పరిహారం : రామ ఆపదుద్దారణ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
సింహ రాశి : వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న వ్యవహారాలలో ఆశించిన ఫలితాలుంటాయి. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలగుతాయి. ఉద్యోగ అధికారులతో ఉన్న సమస్యలు ఆదిగమిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాదిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.
పరిహారం : అర్జున కృత దుర్గా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కన్య రాశి : నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
పరిహారం : గరుడ కవచం పారాయణ చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
తుల రాశి : మిత్రులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపారమున తీసుకునే నిర్ణయాలలో మరింత నిదానంగా వ్యవహారించాలి. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్థిరస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. కొన్ని రంగాల వారికి శ్రమ మరింత పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
పరిహారం : సుబ్రమణ్య భుజంగ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి : చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూల మవుతాయి.వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది. నూతన పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
పరిహారం : శ్రీ కృష్ణ చంద్రాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
ధనస్సు రాశి : వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వారం చివరిలో అనుకోని ధనవ్యయ సూచనలున్నవి. కుటుంబంలో గంధరగోళ పరిస్థితులుంటాయి మానసిక చికాకులు తప్పవు.
పరిహారం : గణేశ హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
మకర రాశి : నూతన గృహ వాహన యోగం ఉన్నది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున జీత భత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి దీర్ఘాకాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగమున్నది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు భాధిస్తాయి. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి.
పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కుంభ రాశి : ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలుగుతాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి చిన్నతరహా పరిశ్రమలకు ఊహించని వివాదాలు నెలకొంటాయి. వారం చివరిలో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
పరిహారం : హనుమాన్ ఛాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మీన రాశి : ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా ముందుకు నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో ఆకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. స్థిరస్తి సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు విఫలమౌతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. వ్యాపారాలలో అనుకోని మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందవు వారం ప్రారంభంలో బంధువుల ద్వారా శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.
పరిహారం : శ్రీరాజరాజేశ్వరి అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.