వార ఫలాలు 24-10-2021 నుండి 30-10-2021 వరకు
Astrology from October 24th to 30th.వార ఫలాలు 24-10-2021 నుండి 30-10-2021 వరకు
By జ్యోత్స్న Published on 24 Oct 2021 9:42 AM ISTమేష రాశి: చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కొన్ని రంగాల వారి అంచనాలు ఫలించవు. వారం మధ్యలో దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి.
పరిహారం: దేవీఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
వృషభ రాశి: బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. రుణ ఒత్తిడులు నుండి బయట పడతారు.కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు, తీసుకుని ముందుకు సాగడం మంచిది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత ఊరట కలిగిస్తాయి. వ్యాపారాలలో మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఒడిదుడుకుల నుంచి బయట పడతారు లభిస్తుంది. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది.
పరిహారం: శివాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మిథున రాశి: నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా మరింత మెరుగుపడుతుంది. కొన్ని వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానలు అందుతాయి వ్యాపారాలు క్రమ క్రమంగా లాభాల బాట పడుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వృధాఖర్చులుంటాయి.
పరిహారం: ఆంజనేయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి: వారం ప్రారంభంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికి నిదానంగా ముందుకు సాగుతారు. ఆర్థికంగా ఇబ్బందులు నుండి బయట పడగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సంతాన విద్య విషయములలో కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమలవారు తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచలున్నవి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు తప్పవు.
పరిహారం: నవగ్రహ ధ్యాన శ్లోకాలు పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
సింహ రాశి: చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తిచేస్తారు.పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పెరుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ నిర్ణయాలు నచ్చుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. వారం మధ్యలో బంధు మిత్రులతో విరోధాలు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.
పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కన్య రాశి: నిరుద్యోగ యత్నలలో పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి విలువైన విషయాలు సేకరిస్తారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో భాగస్వాములవుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ సేవకు తగిన గుర్తింపు పొందుతారు. అన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఆరోగ్య పరంగా చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. మిత్రులతో వివాదాలు కలుగుతాయి.
పరిహారం: కనకధార స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
తుల రాశి: ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయులతో వివాదాలు తీరి సఖ్యతగా వ్యవహారిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. వ్యతిరేకులు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. వ్యాపార పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనుకోని ఖర్చులుంటాయి. సోదరులతో కలహా సూచనలున్నవి.
పరిహారం: మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
వృశ్చికం రాశి: పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో విభేదాలు పరిష్కారమౌతాయి. కొన్ని ఆహ్వనాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. భూ సంభంధిత క్రయ విక్రయాలలో నూతన లాభలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సన్నిహితుల నుంచి ఆశించిన సాయం అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అవాంతరాలు అడదిగమిస్తారు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృధా ఖర్చులు తప్పవు.
పరిహారం: రాజరాజేశ్వరి దేవి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
ధను రాశి: ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో గృహమున సందడిగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సోదరుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల సహాయంతో ఉన్నత పదవులు పొందగలరు చిన్న తరహా పరిశ్రమలకు కీలక సమాచారంఅందుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. బంధు వర్గం వారితో విరోధాలు తప్పవు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
పరిహారం: విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మకర రాశి: వారం ప్రారంభంలో చిన్నపాటి ఇబ్బందులున్న అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది నిరుద్యోగుల ఊహలు నిజం కాగలవు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో శుభాకార్య విషయాలపై చర్చలు చేస్తారు.సమాజసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణాలు చేపడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో లాబాల బాట పడుతాయి ఉద్యోగాలలో చికాకులు అదిగమించి ముందుకు సాగుతారు రాజకీయవర్గాలకు అరుదైన అవకాశాలు అందుతాయి. వారం ప్రారంభంలో సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది.
పరిహారం: హనుమాన్ ఛాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కుంభ రాశి: నూతన కార్యక్రమాలు కార్య రూపం దాలుస్తాయి ఆత్మీయులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిస్తుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు అందుతాయి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలున్నప్పటికి సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తఅవసరం.
పరిహారం: గణేశాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మీన రాశి: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ నిర్ణయాలతో అందరిలోనూ గుర్తింపు పొందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.
పరిహారం: దుర్గాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.