వార ఫలాలు 23-10-2022 నుంచి 29-10-2022 వరకు

Astrology from October 23rd to 29th.ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

By జ్యోత్స్న  Published on  23 Oct 2022 1:41 AM GMT
వార ఫలాలు 23-10-2022 నుంచి 29-10-2022 వరకు

మేషం :ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సన్నిహితులతో వివాదాలు తొలగి ఊరట పొందుతారు. స్థిరస్తి వివాదాల నుంచి బయటపడతారు. దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తు ఉపయోగపడతాయి.

పరిహారం : నవగ్రహ ధ్యాన శ్లోకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

వృషభం : వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి పెట్టాలి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఇంటాబయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. బందు మిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆకస్మిక ధన,వస్తులాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగక నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

పరిహారం : లక్ష్మీ నరసింహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

మిథునం : రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ధన వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసివస్తాయి. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన పనులకు శ్రీకారం చుడతారు వ్యాపారస్తులు నూతన అవకాశాలను దక్కించుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. వారం మధ్యలో గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు జరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. వ్యాపారాలు పురోగతిలో సాధిస్తారు. వారం చివరిలో వృధా ఖర్చులు ఉంటాయి.

పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

కర్కాటకం : ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిస్తుంది. సన్నిహితుల నుంచి ఆశించిన ధన సాయం అందుతుంది. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

పరిహారం : విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

సింహం : ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహన, ఆభరణాలు చేస్తారు. సంతాన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగి లాభాలు అందుకుంటారు. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

పరిహారం : సుబ్రహ్మణ్య కవచం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

కన్య : ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో నూతన పదవులు పొందుతారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. సన్నిహితుల నుండి అందిన ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. సన్నిహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. క్రయ విక్రయాలకు సంబంధించిన ఒప్పందాలు నిరుత్సాహపరుస్తాయి. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

తుల : గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి ధన వ్యవహారాలలో ఇబ్బందులు తప్పవు. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి.

పరిహారం : వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

వృశ్చికం : వ్యాపారాలలో నూతన పెట్టుబడులతో లాభాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

పరిహారం : రాజరాజేశ్వరీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

ధనస్సు : ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి.

పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

మకరం :ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆస్తి వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలకు ధనం వ్యయం చేస్తారు వ్యాపారాలలో మరింత ప్రగతి సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు మరింత అనుకూలిస్తాయి. నూతన గృహ వాహన యోగం ఉన్నది. రంగాల వారికి ఉన్నత అవకాశాలు లభిస్తాయి వారం చివరిలో కుటుంబంలో సమస్యలు ఉంటాయి.

పరిహారం : లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

కుంభం : ధన పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. వారం ప్రారంభంలో బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరతాయి.

పరిహారం : దత్త పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

మీనం : ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు వ్యాపారాలు ఆశించిన విధంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. వాహన అనుకూలత కలుగుతుంది రాజకీయ ప్రముఖులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story