వారఫలాలు 10-10-21 నుంచి 16-10-21 వరకు

Astrology from October 10 to 16th.వారఫలాలు 10-10-21 నుంచి 16-10-21 వరకు

By జ్యోత్స్న  Published on  10 Oct 2021 2:45 AM GMT
వారఫలాలు 10-10-21 నుంచి 16-10-21 వరకు

మేషం రాశి:

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో శారీరకశ్రమ అధికమవుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుపాట్లు ఉండవు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి కష్టంతో నూతన అవకాశాలు పొందుతారు.

పరిహారం: సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభం రాశి:

ఈ రాశి వారికి ఈ వారం కాస్త అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన అన్ని వ్యవహారాలు విజయం సాధిస్తారు ఆర్థికంగా కూడా బాగుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన లాభాలు పొందుతారు. అయితే దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉండటం మంచిది. లేకుంటే ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో చీటికిమాటికి వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. గృహ నిర్మాణయత్నాలలో ఊహించని అవరోధాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

పరిహారం: దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథునం రాశి:

చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. కొన్ని సమస్యలను స్నేహితుల చొరవతో పరిష్కరించుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతానం విద్యా విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను అధికారుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. మాస అంతమున జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలతో కలుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

పరిహారం: హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించిన నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

పరిహారం: కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహం రాశి :

అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఎంతటి వారినైనా మీ మాట మీదకి తీసుకొస్తారు. శత్రు పరమైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతానం ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అన్ని రంగాల వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా అవసరానికి ధనసహాయం లభించి దీర్ఘకాలిక రుణాలు తీర్చ గలుగుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి:

చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది.రాను రాను పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహమున శుభకార్యాల గూర్చి బంధుమిత్రులతో చర్చలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

పరిహారం: విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి :

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహాలతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు మరొకసారి నిరాశ తప్పదు. కొన్ని విషయాలలో తొందరపాటు వలన ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపుల అవసరమవుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.

పరిహారం: రాజరాజేశ్వరి దేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి:

అనుకూల వాతావరణం ఉంటుంది. చాలాకాలంగా పూర్తి కాని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్న అవసరానికి ధన సహాయం అందుతుంది. ఊహించని సమస్యలు కలుగుతాయి నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి ఉద్యోగాలలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని రంగాల వారికి రావలసిన గుర్తింపు రాక నిరాశ పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

పరిహారం: లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేయటం వలన విశేషమైన ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి:

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం తగినంత లభిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

పరిహారం: గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి:

మిశ్రమ వాతావరణం ఉంటుంది ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు కలిగినప్పటికీ కొంత నిదానంగా పూర్తి చేయగలుగుతారు.సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంతాన పరంగా శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణ అనుకూలత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చివరి నిముషాల్లో నిర్ణయాల మార్పు వల్ల లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభం రాశి:

ఈ వారం అంతగా అనుకూలంగా ఉండదు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. వృత్తి వ్యాపారాలు అంతగా రాణించవు. ఆర్థికంగా మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చుట్టుపక్కల వారితో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. అవసరానికి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

పరిహారం: నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీనం రాశి:

ఈ రాశి వారికి ఈ వారం అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉండదు ఆదాయపరంగా కొంత ఒడిదుడుకులు అధికమవుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపార విషయంలో ప్రభుత్వ సంబంధిత జరిమానాలు కట్టాల్సి రావచ్చు. ఇంటా బయటా కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. గృహమున ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

పరిహారం: శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story