వారఫలాలు 07-11-2021 నుంచి 13-11-2021 వరకు

Astrology from November 7th to 13th.వారఫలాలు 07-11-2021 నుంచి 13-11-2021 వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Nov 2021 2:41 AM GMT
వారఫలాలు 07-11-2021 నుంచి 13-11-2021 వరకు

మేష రాశి : చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు.దాయదులతో భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వాహన, గృహయోగాలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు అందిన ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఇతరులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : శివసహస్ర నామ స్తోత్రం పారాయణం చెయ్యడం మంచిది.

వృషభ రాశి : నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో చర్చలు సాగిస్తారు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు విలువైన సమాచారం ఆనందం కలిగిస్తుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. గృహ నిర్మాణ యత్నలు కార్య రూపం దాలుస్తాయి.ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట పొందుతారు. చిన్నతరహ పరిశ్రమలకు లాభాలు అందుతాయి. వారం చివరిలో కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

పరిహారం : గురు చరిత్ర పారాయణం చెయ్యడం మంచిది.

మిథున రాశి : ధనపరంగా ఇబ్బందులు అధిగమిస్తారు.స్థిరస్తి వివాదాలకు సంభందించి విలువైన సమాచారం అందుతుంది. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. కుటుంబమున కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో దీర్ఘ కాలిక సమస్యలు తీరతాయి. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థుల పరీక్ష ఫలితాలు సంతృప్తినిస్తాయి. వారం చివరిలో ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నూతన రుణాలు చేస్తారు.

పరిహారం : విష్ణుసహస్రనామ పారాయణ చెయ్యడం మంచిది.

కర్కాటక రాశి : ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది.ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శుభ కార్యములు మధ్యలో వాయిదా వేస్తారు. వ్యాపారమున తొందరపాటు ఆలోచనలు కలసిరావు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలున్నవి. కొన్ని రంగాల వారికి నిరాశ తప్పదు. వారం ప్రారంభంలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు.

పరిహారం : గణేశాష్టకం పారాయణ చెయ్యడం మంచిది.

సింహ రాశి : చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారాల విస్తరణకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకు తగ్గుతాయి. కొన్ని రంగాల వారి యత్నాలు సఫలమవుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులుంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.

పరిహారం : దుర్గా స్తోత్రం పారాయణం చెయ్యడం మంచిది.

కన్య రాశి : చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో మిత్రులు, సన్నిహితులు సలహాలు కలసివస్తాయి. ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు పొందుతారు. స్థిరస్తి వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. నూతన వాహనసౌఖ్యం ఉన్నది ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు తప్పవు. వృధా ఖర్చులు పెరుగుతాయి.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం మంచిది.

తుల రాశి : సమాజంలో ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి.నూతన వాహన యోగం ఉన్నది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మరింత ఉత్సాహవంతకాలం. దీర్ఘ కాలిక వివాదాల నుంచి బయటపడతారు. బంధు మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహంతో పనిచేసి లాభలు అందుకుంటారు. నూతన గృహ ప్రారంభ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది. వారం చివరిలో స్వల్ప ఆరోగ్యసమస్యలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారలు మరింత చికాకు కలిగిస్తాయి.

పరిహారం : నవగ్రహస్తోత్రాలు పారాయణం చెయ్యడం మంచిది.

వృశ్చిక రాశి : దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. సోదరులతో ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో దూరపు బంధువుల నుండి అందిన ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరణకు పెట్టుబడులు అందుతాయి, ఉద్యోగమున అధికారులతో విభేదాలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. కొన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. వారం మధ్యలో ఊహించని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

పరిహారం : కనకధారా స్తోత్రం పారాయణం చెయ్యడం మంచిది.

ధను రాశి : చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు బంధువులతో సంతాన వివాహ విషయం గూర్చి చర్చిస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు చిరకాల కోరిక నెరవేరుతుంది. నూతన గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయవర్గాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో దాయదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : హయగ్రీవస్తోత్రం పారాయణం చేయడం మంచిది.

మకర రాశి : దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి.దీర్ఘాకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థుల యత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్థులకు ఊహలు నిజం అవుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆశించిన విధంగా సాగుతాయి. ఉద్యోగులకు మరింత ఉత్సాహకర సమయం. కొన్ని రంగాల వారికి నూతన అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబమున చికాకులు తప్పవు.

పరిహారం : రామారక్ష స్తోత్రం పారాయణం చెయ్యడం మంచిది.

కుంభ రాశి : అనుకున్న పనుల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. ప్రముఖులతో పరిచయాలు విసతృతమౌతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు.నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబమున కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు.వృత్తి ఉద్యోగమున మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారమున స్వంత ఆలోచనలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఊహించని అవకాశాలు అందుతాయి.వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలున్నవి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. సోదరులతో వివాదాలు తప్పవు.

పరిహారం : మధురాష్టకం పారాయణం చెయ్యడం మంచిది.

మీన రాశి : నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఒక ముఖ్య విషయమై చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశజానాకంగా ఉంటుంది. చాలకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో గృహమున సఖ్యతగా వ్యవహారిస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.రాజకీయవర్గాల వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి.

పరిహారం : దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం మంచిది.

Next Story