వార ఫలాలు 06-11-2022 నుంచి 12-11-2022 వరకు

Astrology from November 6th to 12th.సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నెలకొన్న సందిగ్ధత తొలగుతుంది. చేపట్టిన పనుల్లో

By జ్యోత్స్న  Published on  6 Nov 2022 1:54 AM GMT
వార ఫలాలు 06-11-2022 నుంచి 12-11-2022 వరకు

మేష రాశి : సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నెలకొన్న సందిగ్ధత తొలగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా కాస్త మెరుగైన పరిస్థితులుంటాయి. చిన్న తరహా పరిశ్రమలు క్రమ క్రమంగా లాభాల బాట పడుతాయి. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై పెద్దలతో చర్చలు చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి : కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. సన్నిహితుల ప్రోత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి తెలివిగా బయట పడతారు. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని రంగాల వారికి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

పరిహారం : కాలభైరవాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మిథున రాశి : బంధు మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అనుకుంటారు. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని రంగాల వారికి ఆశలు అంతగా ఫలించవు. వారం మధ్యలో ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వారం చివరిలో మిత్రులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

కర్కాటక రాశి : ఆర్థికంగా మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలానాలు తప్పవు. నూతన కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆత్మీయులతో కీలక విషయాలు గూర్చి చర్చిస్తారు.వారం మధ్యలో ఒక వివాదాన్ని అత్యంత ఓర్పుతో పరిష్కరించుకుంటారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు వ్యవహారాలలో విజయం. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు క్రమంగా లాభాల బాట నడుస్తాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణ సూచనలు.

పరిహారం : దుర్గాఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి : గృహమున మీ నిర్ణయాలు అందరికి నచ్చుతాయి. శత్రువులను కూడా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. విద్యార్థులు పరీక్షఫలితాలు కొంత ఊరట ఇస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుండి బయటపడతారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు. సోదరులతో సఖ్యతగా వ్యవహారిస్తారు దైవకార్యాలలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు. కొన్ని రంగాల వారికి ఒత్తిడుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

పరిహారం : దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్య రాశి : ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికి రాదు. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో దూరప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగుల అంచనాలు, ఊహలు కొన్ని నిజం చేసుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు అప్రయత్నంగా నూతన అవకాశములు దక్కించుకుంటారు. కొన్ని రంగాల వారికి మార్పులు తప్పవు. దాయదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు.

పరిహారం : ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు

తుల రాశి : పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు గృహమున శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికీ నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి నూతన గృహప్రవేశం నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు వ్యాపారాలలో గతం కంటే మంచి లాభాలు అందుతాయి ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. సంఘంలో మర్యాదలకు లోటు ఉండదు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది.

పరిహారం : విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణ చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : చేపట్టిన పనులులో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత గంధరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.వారం మధ్యలో చిన్న నాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన సమయానికి నిద్రహారాలు ఉండవు. గృహ నిర్మాణ యత్నాలు మందగిస్తాయి. భూ సభంధిత క్రయ విక్రయలు కలసిరావు. చిన్నతరహా పరిశ్రమలకు శ్రమధిక్యత తప్పదు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. మీ నిర్ణయాలను ఇంటా బయట అందరు గౌరవిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. పాత విషయాలు కుటుంబసభ్యులతో చర్చిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలమౌతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

పరిహారం : సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్న నాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. నూతన వ్యక్తులు పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆస్తుల క్రయవిక్రయాలలో సమస్యలు తొలగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. విద్యార్థులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన లక్ష్యాలు సాధిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆకారణ వివాదాలు తప్పవు.

పరిహారం : హయగ్రీవస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : సంఘంలో పేరుప్రతిష్ఠలకు లోటు ఉండదు.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సన్నిహితుల సాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం పెరుగుతాయి. తెలివితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులలో ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. వారం చివరిలో వృధా ప్రయాణాలు ఉంటాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు.వ్యాపారాలు క్రమంగా లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. అన్ని రంగాల వారికి ఒత్తిడులు తొలగుతాయి.

పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీన రాశి : కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి కుటుంబసభ్యులు మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. చిన్నతరహా పరిశ్రమల శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

పరిహారం : గణనాయక అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story