వార ఫలాలు 28-11-2021 నుంచి 4-12-2021 వరకు

Astrology from November 28th to December 4th.వార ఫలాలు 28-11-2021 నుంచి 4-12-2021 వరకు

By జ్యోత్స్న  Published on  28 Nov 2021 2:53 AM GMT
వార ఫలాలు 28-11-2021 నుంచి 4-12-2021 వరకు

మేషం రాశి : ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా బాధిస్తుంది. ఆలయాలు సందర్సనాలు చేసుకుంటారు. సోదరులతో స్థిరస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. నిరుద్యోగులకు అవకాశములు లభించినట్లే దూరమవుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. చిన్నతరహా పరిశ్రమలకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

పరిహారం : దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృషభం రాశి : ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమౌతాయి. జీవిత భాగస్వామితో దేవాలయాలు సందర్శిస్తారు. బంధు మిత్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉన్నత పదవులు దక్కుతాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాదిస్తాయి.

పరిహారం : గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి : చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతాయి కొన్ని వ్యవహారాలలో ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. గృహమున ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చాలాకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగులకు ఆశించిన పదవులు పొందుతారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి వారం ప్రారంభంలో స్వల్ప ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

పరిహారం : విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సన్నిహితులు, మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖ వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో నష్టాలను అదిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. అన్ని రంగాల వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులుంటాయి. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు తప్పవు.

పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం మంచిది.

సింహ రాశి : ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు స్థిరస్తి వివాదాల పరిష్కారమౌతాయి. ఆప్తుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘాకాలిక సమస్యలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతుంది. వారం మధ్యలో స్వల్ప ధనవ్యయ సూచనలు ఉన్నవి. బంధు మిత్రుల వలన ఊహించని సమస్యలు చికాకు పరుస్తాయి.

పరిహారం : సూర్య కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్య రాశి : ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ప్రముఖుల నుంచి ఊహించని విధంగా సహాయ సహకారాలు అందుతాయి.సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు సాగిస్తారు. సంతాన వివాహయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి నూతన లాభలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతాయి. రాజకీయవర్గాలకు అంచనాలు నిజం అవుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. మిత్రులతో ఆకారణ కలహాలు కలుగుతాయి.

పరిహారం : సుబ్రహ్మణ్యష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి : కీలక వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి. మిత్రులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. దీర్ఘాకాలిక అనారోగ్యసమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు చేసే ప్రయత్నాలు అనుకూలస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికి నిదానంగా ముందుకు సాగుతారు. చిన్నతరహా పరిశ్రమలకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. సోదరుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి.

పరిహారం : శివాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులు నుంచి శుభవార్తలు అందుతాయి. సంతాన విద్యా విషయంలో పురోగతి కనిపిస్తుంది. గృహములో శుభకార్యాల నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు కొన్ని జ్ఞప్తికి వచ్చి బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు తొలగి విశేషమైన లాభాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగతాయి. చిన్నతరహా పరిశ్రమలకు అన్ని విధాలా కలసివచ్చే కాలం. వారం మధ్యలో కుటుంబంలో వివాదాలు మానసిక అశాంతి కలిగిస్తాయి

పరిహారం : హనుమాన్ ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : వారం ప్రారంభంలో స్వల్ప వివాదాలు కలుగుతాయి ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. సోదరులు, స్థిరస్తి వివాదాలు సర్దుబాటు అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. నిరుద్యోగుల ప్రయత్నం ఫలించి నూతన అవకాశములు అందుకుంటారు.విద్యార్థుల పరీక్షఫలితాలు సంతృప్తినిస్తాయి. నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

పరిహారం : మేధో దక్షిణమూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి : ముఖ్యమైన పనులు నిదానంగా సాగిన పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పారిశ్రామికవర్గాలకు మెరుగైన అవకాశాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.

పరిహారం :వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి అవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకూ పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నిరుద్యోగులకు అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు , ఇంటా బయట బాధ్యతలు కొంత తగ్గి ఊరట పొందుతారు. అన్ని రంగాల వారి కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో మానసిక చికాకులు పెరుగుతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు.

పరిహారం : ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం పారాయణం చెయ్యడం మంచిది.

మీన రాశి : చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్నేహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన పనులలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. భూవివాదాలు తీరి పరిష్కారం లభిస్తుంది.ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి.దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఆశలు చిగురిస్తాయి. కీలక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంతాన వివాహయత్నాలు సానుకూలమవుతాయి. చాలకాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి ఊరట పొందుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి. వారం చివరిలో బంధు వర్గంతో వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : లక్ష్మి నృసింహ కరావలంభ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Next Story