వార ఫలాలు 21-11-2021 నుంచి 27-11-2021 వరకు

Astrology from November 21th to 27th.వార ఫలాలు 21-11-2021 నుంచి 27-11-2021 వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Nov 2021 2:52 AM GMT
వార ఫలాలు 21-11-2021 నుంచి 27-11-2021 వరకు

మేష రాశి : దీర్ఘ కాలికంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. కీలక సమయంలో స్నేహితులు సహాయం అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. గృహ నిర్మాణయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. గృహమున శుభాకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం చివరిలో బంధు వర్గం వారితో అకారణ వివాదాలుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృషభ రాశి : స్వంత నిర్ణయాలతో ఇంటా బయట వ్యవహారాలు పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చాలకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన వాహనయోగం ఉన్నది.ఆర్థికంగా ఇబ్బందులు తొలగి రుణాలు తీర్చగలరు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టి తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సకాలంలో పనులు పూర్తి చేసి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : ఆంజనేయస్వామి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మిథున రాశి : చేపట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. భూ సంభంధిత వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. జీవిత భాగస్వామి నుండి స్థిరస్తి లాభాలు పొందుతారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. సంతాన విద్యా విషయంలో అనుకున్న ఫలితాలు పొందుతారు ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అవసరానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతన భాద్యతలు చేపడతారు. అన్ని రంగాల వారికి విశేషమైన ఫలితాలుంటాయి. వారం ప్రారంభంలో పనులందు స్వల్ప అవరోధలుంటాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి.

పరిహారం : సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహ, వాహనయోగమున్నది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశములు దక్కించుకుంటారు. కొన్ని రంగాల వారికి నూతన ఆశలు చిగురిస్తాయి.వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. శారీరక అనారోగ్య సమస్యలు బాదిస్తాయి.

పరిహారం: నవగ్రహ ఆరాధనా చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి : ఆర్థికంగా మరింత అనుకూల పరిస్థితులుంటాయి. బంధువులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. దైవ సేవాకార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులుంటాయి.

పరిహారం: విష్ణుసహస్రనామస్తోత్రం పారాయణ చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కన్య రాశి : బంధు వర్గం వారి నుండి కీలక విషయాలు సేకరిస్తారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన పనుల్లో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.వాహన యోగం ఉన్నది. వ్యాపారాలలో నష్టాలను అదిగమిస్తారు ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశములు అందుతాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి.దూర ప్రయాణ సూచనలున్నవి.

పరిహారం: రామారక్ష స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి : దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కారంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. విద్యార్థులు పరీక్షలలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. రాజకీయ వర్గ నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

పరిహారం: విష్ణు పంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : చాలకాలంగా పూర్తికాని పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కీలక సమయంలో ఆత్మీయులు సలహాలు కలసివస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. పోటీపరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి. వారం ప్రారంభంలో ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది.

పరిహారం: కనకధారా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు.కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ధన సహాయం అందుతుంది. గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు., నిరుద్యోగుల ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల బాటలొ సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.వారం మధ్యలో బంధు వర్గంతో విరోదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం: దత్త పంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మకర రాశి : అనుకున్న పనుల్లో జాప్యం కలిగిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమ మరింత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిరాశాజనకంగా సాగుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. బంధువర్గం నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. అన్నిరంగాల వారికి ఆశించిన ఫలితాలుంటాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది.

పరిహారం: శివ సహస్రనామా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలుచేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. కొన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయ సూచనలున్నవి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి.

పరిహారం: దుర్గాదేవి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీన రాశి : ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులలో పురోగతి సాధిస్తారు. బంధు , మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వృత్తి ఉద్యోగమున తెలివితేటలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. అన్నిరంగాల వారి అంచనాలు నిజమవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలున్నవి. గృహ వాతవరణం గందరగోళంగా ఉంటుంది.

పరిహారం: వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Next Story