వార ఫలాలు 08-05-2022 నుండి 14-05-2022 వరకు

Astrology from May 8th to 14th.వార ఫలాలు 08-05-2022 నుండి 14-05-2022 వరకు

By జ్యోత్స్న  Published on  8 May 2022 5:00 AM GMT
వార ఫలాలు 08-05-2022 నుండి 14-05-2022 వరకు

మేషం రాశి : వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి కీలక వ్యవహారాలలొ అవరోధాలు తొలగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి గృహమున శుభకార్య నిర్వహణ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూలంగా సాగుతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు సర్దుమణుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలను అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ధన వ్యయ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

పరిహారం : సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభం రాశి : చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు పరుస్తారు.ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయమై కోరుకున్న విధంగా స్థానచలనాలు ఉంటాయి. కొన్ని రంగాల వారికి పెద్దవారి నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వారం చివరన శ్రమ పెరుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.

పరిహారం: గణపతి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు చేసుకుని అవసరాలు తీర్చుకుంటారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవాంతరాలు తొలగి ముందుకు సాగుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానం విద్యా విషయాలలో శుభఫలితాలు అందుతాయి వృత్తి వ్యాపారాల గురించి చేసే ఆలోచనలు లాభాలు కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు చిన్నతరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమౌతాయి బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : నవగ్రహ కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం చేస్తారు.రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో ఆలోచన కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయట విశేషమైన ఆదరణ పెరుగుతుంది. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు సంతాన వివాహ శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చలు జరుగుతాయి.ఉద్యోగ విషయంలో పై అధికారులతో సంప్రదించడానికి చేసే ప్రయత్నాలు సఫలమౌతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు అవాంతరాలు తొలగి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో మిత్రులతో చిన్నపాటి కలహా సూచనులున్నవి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

పరిహారం : లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి : చాలకాలంగా బాదిస్తున్న సమస్యలు క్రమక్రమంగా తొలగి పరిస్థితులు అనుకూలిస్తాయి ఆప్తులతో గృహమున సరదాగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు అధిక శ్రమతో కానీ ఫలితం కనిపించదు. కొన్ని వ్యవహారాలలో బంధువుల సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు.

పరిహారం : కనకదార స్తోత్రం పారాయణం చేయడం వలన పొందుతారు శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి : దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి బంధుమిత్రులతో వివాదాలు తొలగి ఊరట పొందుతారు ఆర్థికంగా కొంత పుంజుకుంటారు ఇతరుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువను పెంచుకుంటారు. స్ధిరాస్తి లాభాలు పొందుతారు విద్యార్థుల ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో సహచరులతో మాట పట్టింపులు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం మధ్యలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

పరిహారం : రామారక్ష స్తోత్రం పారాయణం చేయడం వలన ఫలితాన్ని పొందుతారు.

తుల రాశి : చేపట్టిన పనులలో విజయం సాదిస్తారు. సంతానం విద్యా విషయాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు తో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికి నచ్చేవిధంగా ఉంటాయి. స్థిరస్తి వ్యవహారంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి రుణాలు తీరుస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ధార్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు అంది విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలను అందుతాయి వారం చివరన పనులలో శ్రమ కలుగుతుంది మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి.

పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి : చేపట్టిన పనుల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. స్నేహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది.ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఆస్థి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఇంటాబయట మీ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారు కుటుంబసభ్యులతో సఖ్యత పెరుగుతుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి.దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి : నూతన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు గృహమునకు బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఇంటాబయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు చిన్ననాటి ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసివస్తాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలను స్వీకరించి ముందుకు మంచిది వ్యాపారాలలో గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి : శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు ఆత్మీయులతో చర్చలు చేసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అవసరానికి చేతికందుతుంది కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు మిత్రులతో వివాదాలు సర్దుమణుగుతాయి స్థిరాస్తి వివాదాల లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంతాన పరంగా శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నం సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఉద్యోగ ఈ విషయంలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ఊరట పొందారు.కొన్ని రంగాల వారికి విలువైన సమాచారం అందుతుంది వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు తప్పవు.

పరిహారం : లింగాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : చేపట్టిన పనులు వాయిదా పడతాయి. కుటుంబ ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు.నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు.ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది అన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్వల్ప ధన లాభసూచనలు ఉన్నవి.

పరిహారం : లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు.

మీన రాశి : చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రులనుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి అవసరానికి డబ్బు అందుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమునకు సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు కొన్ని వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలను అందుతాయి. నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.ఉద్యోగ విషయమై అధికారులతో సమస్యలను పరిష్కరించుకుంటారు. అన్ని రంగాల వారికి కొంత అనుకూల వాతవరణం ఉంటుంది. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.ఆరోగ్యవిషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

పరిహారం : విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story
Share it