వార ఫలాలు 23-05-2021 నుండి 29-05-2021వరకు
This week Astrology from May 23rd to 29th in Telugu.వార ఫలాలు 23-05-2021 నుండి 29-05-2021వరకు
By తోట వంశీ కుమార్ Published on 23 May 2021 6:39 AM ISTమేష రాశి :
ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆప్తులతో వివాదాలు పరిష్కారమవుతాయి స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ధన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
పరిహారం : గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృషభ రాశి:
ఈవారం అంతగా అనుకూలించదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఇంట బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మానసిక అనారోగ్య సమస్యలు కొంతవరకు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. విద్యార్థులకు కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉంటాయి. వారం చివరన దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మిథున రాశి:
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. చాలాకాలంగా రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆప్తుల నుండి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని బాధపడతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అధికారుల అండదండలతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అన్నీ రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారంతమున ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
పరిహారం : విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన ఫలితాలు అందుకుంటారు.
కర్కాటక రాశి:
సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు పుంజుకుంటాయి. కొన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో పనులు మందగిస్తాయి. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి మిత్రులతో వివాదాలు ఉంటాయి.
పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
సింహ రాశి:
సన్నిహితుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహన,ఆభరణాలుకొనుగోలుచేస్తారు. ముఖ్యమైనవ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. పాత మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు అందుతాయి. వారం చివరిలో సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్తవహించాలి. పరిహారం :
పరిహారం : గణనాయక అష్టకం పారాయణం చేయుట వలన ఫలితం పొందుతారు.
కన్య రాశి:
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి లభిస్తుంది స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో చేపట్టిన పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
పరిహారం : సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
తుల రాశి:
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెట్టి మంచి ఫలితాలు సాధిస్తారు. మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అధికారుల అండదండలు లభిస్తాయి. వారం మధ్యలో సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.
పరిహారం : దుర్గా కవచం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి:
సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు బంధుమిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం అందుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు లభిస్తాయి విదేశీ ప్రయాణాలకు అనుకూలత కలుగుతుంది. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు.
పరిహారం : ఆంజనేయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
ధను రాశి:
సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దీర్ఘ కాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తొలగి ఊరట కలుగుతుంది. పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులు సొంత ఆలోచనలతో ఉన్నత స్థితిని పొందుతారు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలతో లాభాలు పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల మార్పులు ఉంటాయి. కొన్ని రంగాలవారు ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి.
పరిహారం : వేంకటేశ్వర స్వామి వజ్ర కవచంపారాయణం చేయడంవలన శుభఫలితాలు పొందుతారు.
మకర రాశి:
ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాల రాజీ చేసుకుంటారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఇంటాబయటా సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. నిరుద్యోగ యత్నాలు మరింత ఉత్సాహంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో మరింత పురోగతి సాధిస్తారు ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు అందుతాయి. వారం చివరన కుటుంబ సభ్యులతో సమస్యలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుబాధిస్తాయి.
పరిహారం :నరసింహకరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కుంభ రాశి:
పాతబాకీలు వసూలవుతాయి. నూతన రుణాలు తీర్చగలుగుతారు. బంధుమిత్రుల సహకారం అందుతుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. సమాజంలోపెద్దలతో సంప్రదింపులకు అనుకూలత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. స్ధిరాస్తి వివాదాలలో తెలివిగా వ్యవహరించి బయటపడతారు. ఉద్యోగస్తులకు ఆర్థిక వృద్ధి కలుగుతుంది. అన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆర్ధిక ఇబ్బందులుంటాయి.
పరిహారం : ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మీన రాశి:
సంఘంలో పెద్దలతో విశేషమైన ఆదరణ లభిస్తుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో సమస్యలు తొలగి ఊరటచెందుతారు. కొన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే పుంజుకుంటుంది ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం చివరన ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది.
పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.