వారఫలాలు 1-05-2022 నుంచి 7-05-2022 వరకు

Astrology From May 1st to 7th.వారఫలాలు 1-05-2022 నుంచి 7-05-2022 వరకు

By జ్యోత్స్న  Published on  1 May 2022 8:07 AM IST
వారఫలాలు 1-05-2022 నుంచి 7-05-2022 వరకు

మేషం రాశి : ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహసంచారం అనుకూలంగా లేదు అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో వైద్యులు సంప్రదింపులు చేయవలసి వస్తుంది. మానసికంగా ప్రశాంతత లోపిస్తుంది ఇతరులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. గృహమున వివాహాది శుభకార్యములు నిర్వహిస్తారు. ఆర్థిక సమస్యలు తొలగుతాయి.

పరిహారం : దుర్గా అమ్మవారి ఆరాధన చేయటం. దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభం రాశి : ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉద్యోగము ఉన్నతికి చేసే ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి వారం మధ్యనుండి జీవితభాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం.

పరిహారం : సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

మిథునం రాశి : ఈ రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని రంగాల వారికి యోగ దాయకంగా ఉంటుంది. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. వృత్తివ్యాపారాలందు విశేషమైన లాభాలు అందుకుంటారు ఆర్థికంగా గతం కంటే కొంత పరిస్థితులు మెరుగవుతాయి. అన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటకం రాశి : ఈ రాశి వారికి ఈ వారం లో గ్రహ సంచారం అనుకూలంగా లేదు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయడంలో విఫలం అవుతారు. పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. దూర ప్రయాణాలలో వాహన ప్రమాదం సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో చీటికిమాటికి మాటపట్టింపులు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సోదరులతో స్థిరాస్తుల విషయంలో వివాదాలు తప్పవు. ఉద్యోగస్తులు చేయని పనికి నిందలు పడవలసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

పరిహారం : శివ పంచాక్షరీ మంత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహం రాశి : ఈ రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల అప్రమత్తంగా వ్యవహరించాలి గృహమున గాని ఉద్యోగము గాని స్థాన చలనాల తప్పవు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది. వారం చివర ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు.

పరిహారం : ఆంజనేయస్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి : ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికామౌతుంది. వృధా ఖర్చులు కూడా చేదాటుతాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృథా ప్రయాణాలవల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆ కారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించాలి వారం చివర కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యములకు హాజరువుతారు.

పరిహారం : గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి : ఈ రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి చేయగలుగుతారు మానసిక ఆందోళనలు పెరుగుతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలు వీలైనంత వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల వలన ఊహించని సమస్యలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు అంతగా కలిసి రావు సన్నిహితులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది.

పరిహారం : నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చికం రాశి : ఈ రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని రంగాల వారికి గతంకంటే పరిస్థితులు మెరుగుపడతాయి.వృత్తి వ్యాపారాల విస్తరణ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఏదో విధంగా ధన సహాయం అందుతుంది.పాత రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఒక్కసారిగా పరిష్కారమవుతాయి ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో విజయం సాధిస్తారు గృహమున వివాహాది శుభాకార్యాలు నిర్వహిస్తారు.

పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం ప్రతి నిత్యం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి. ఆదాయం గతం కంటే మెరుగు పడుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకరం రాశి : ఈ రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలత కూడా ఉన్నది. చేపట్టిన పనులు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. అవసరానికి చేతిలో ధనం నిలవలేక నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ చింతన పెరుగుతుంది.

పరిహారం : విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభం రాశి : ఈ రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా లేదు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన ఋణప్రయత్నాలు కలసి రావు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. గృహమున కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది వృత్తి వ్యాపారాలు కొంతమంది కొనసాగుతాయి ఇంటా బయట గౌరవ మర్యాదలు తగ్గుతాయి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతాన విద్యాఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. వారం చివర పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు.

పరిహారం : హయాగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీనం రాశి : ఈ రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా లేదు అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నేత్ర శిరో సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన వ్యవహారాలలో మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయం వల్ల నష్టాలు తప్పవు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. వారం చివర ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story