వార ఫలాలు 27-03-2022 నుండి 02-04-2022 వరకు

Astrology From March 27th to April 2nd.వార ఫలాలు 27-03-2022 నుండి 02-04-2022 వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 March 2022 2:39 AM GMT
వార ఫలాలు 27-03-2022 నుండి 02-04-2022 వరకు

మేష రాశి: నూతన విషయాలు సేకరిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటాబయట మీదే పైచేయిగా ఉంటుంది. మొండి బాకీలు అనుకున్న విధంగా వసూలవుతాయి. ఆరోగ్య సమస్యలు కొంతమేర తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది. వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. అన్ని రంగాల వారి అంచనాలు నిజమౌతాయి. వారం మధ్యలో పనులలో వ్యయప్రయాసలు తప్పవు. బంధువులతో మాట పట్టింపులుంటాయి.

పరిహారం: శివారాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులు నూతన ఆశలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చిన్నతరహా పరిశ్రమల ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

పరిహారం: పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి: నూతన వ్యవహారాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అను కూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట కొన్ని సమస్యల నుంచి నేర్పుగా బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పేరు కలిగిన వ్యక్తులు పరిచయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలుంటాయి చిన్నతరహా పరిశ్రమల కలలు ఫలించే సమయం. వారం చివరిలో బంధువులతో చిన్నపాటి వివాదాలుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

పరిహారం: గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి: ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు కొన్ని తొలగుతాయి. ఉద్యోగమున సమస్యలు ఎదురైనా ఇతరుల సాయం లేకుండా నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. వ్యాపారాలలో విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అన్ని రంగాల వారికి ఉత్సాహవంతమైన కాలం. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. కొందరి మాటలు మానసిక అశాంతి కలిగిస్తాయి.

పరిహారం: లక్ష్మి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చాలకాలంగా పడిన శ్రమ ఫలించి విజయం సాధిస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు సఫలమవుతాయి. మిత్రులతో దైవకార్యాలలో పాల్గొంటారు. సన్నిహితులతో వివాదాలలో చర్చలు ఫలిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.ఉద్యోగాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కొన్ని రంగాల వారికి ఆశించిన అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో స్వల్ప వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.

పరిహారం: కనకధార స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్య రాశి: ముఖ్యమైన పనులలో కొంత జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది.

పరిహారం: లక్ష్మి నృసింహస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల రాశి: చాలా కాలం పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు పొందుతారు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో మెరుగైన లాభాలు అందుతాయి. ఉద్యోగస్థులకు హోదాలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమల వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో ఆప్తులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ధన ఆదాయ మార్గాలు తగ్గుతాయి.

పరిహారం : విష్ణుసహస్రనామస్తోత్రం పారాయణ చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి: ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉన్నా అవసరాలు తీరతాయి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. సోదరులు చిన్నపాటి వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూల మౌతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం కొంత వరకు తగ్గుతుంది. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధన వ్యయ సూచనలున్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : దేవిఖడ్గ మాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి: ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఇంటాబయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులను కూడా నేర్పుగా ఆకట్టుకుంటారు. స్థిరాస్తుల వ్యవహారంలో నెలకొన్న వివాదాలు సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలమయ్యే సమయం. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు గంధరగోళ పరిస్థితులుంటాయి. వారం మధ్యలో ధన పరమైన సమస్యలుంటాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు తప్పవు.

పరిహారం : వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. దూరపు బంధువులతో సఖ్యత కలుగుతుంది. స్థిరస్తి క్రయ విక్రయాలలో ప్రతిష్ఠంభన తొలగుతాయి. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి పరిస్థితులు మెరుగౌతాయి. వారం మధ్యలో వృధా ప్రయాణాలు చేస్తారు. బంధు వర్గంతో తగాదాలు తప్పవు.

పరిహారం : హయగ్రీవస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి: ముఖ్యమైన వ్యవహారాలు చిన్నపాటి కష్టంతో పూర్తి చేస్తారు.ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభ వార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యగస్థులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమల పరిస్థితులు క్రమేపీ మెరుగుపడతాయి. కొన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో బందు వర్గంతో తగాదాలు ఉంటాయి. ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీనం రాశి: మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. కొన్ని సందర్భాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. చిన్ననాటి విషయాలు కొన్ని జ్ఞప్తికి వస్తాయి. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : గురు చరిత్ర పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Next Story