వార ఫలాలు 06-06-2021 నుండి 12-06-2021 వరకు

Astrology from June 6th to 12th.వార ఫలాలు 06-06-2021 నుండి 12-06-2021 వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2021 1:11 AM GMT
వార ఫలాలు 06-06-2021 నుండి 12-06-2021 వరకు

మేష రాశి:

ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆత్మీయల నుండి శుభవార్త అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి గృహమున శుభకార్య నిర్వహణ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా సాగుతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు సర్దుమణుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలను అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ధన వ్యయ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

పరిహారం : గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.


వృషభ రాశి:

పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి ముఖ్యమైన కార్యక్రమాలలో ఆలోచనలు వెంటనే అమలు పరుస్తారు.ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు యత్నాలు వేగవంతం చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు . నూతన వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయమై కోరుకున్న విధంగా స్థానచలనాలు ఉంటాయి. కొన్ని రంగాల వారికి పెద్దవారి నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వారం చివరన శ్రమ పెరుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.

పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి:

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవసరాలు తీరతాయి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు సోదరులతో స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అవాంతరాలు తొలగి ముందుకు సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానం విద్యా విషయాలలో శుభఫలితాలు అందుతాయి వృత్తి వ్యాపారాల గురించి చేసే ఆలోచనలు లాభాలు కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు చిన్నతరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమౌతాయి బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి:

చేపట్టినపనులలో అప్రయత్నకార్యసిద్ధి కలుగుతుంది గృహమును ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలకు ధనసహాయం చేస్తారు.రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో ఆలోచన కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయట విశేషమైన ఆదరణ పెరుగుతుంది. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు సంతాన వివాహ శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చలు జరుగుతాయి.ఉద్యోగ విషయంలో పై అధికారులతో సంప్రదించడానికి చేసే ప్రయత్నాలు సఫలమౌతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు అవాంతరాలు తొలగి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో మిత్రులతో చిన్నపాటి కలహాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

పరిహారం : లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి:

ఇప్పటివరకు పడిన ఇబ్బందులు క్రమం క్రమక్రమంగా తొలగి పరిస్థితులు అనుకూలిస్తాయి.ఆప్తులతో సరదా సంభాషణలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు శ్రమతో ఫలితం కనిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో బంధువుల సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు.

పరిహారం : సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయడం వలన పొందుతారు శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి :

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి బంధుమిత్రులతో తొలగి ఊరట పొందుతారు ఆర్థికంగా కొంత పుంజుకుంటారు ఇతరుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువను పెంచుకుంటారు. స్ధిరాస్తి లాభాలు కలిగే అవకాశం ఉన్నది. విద్యార్థుల ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకునే లాభాలను అందుకుంటారు. ఉద్యోగ విషయంలో సహచరులతో మాట పట్టింపులు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం మధ్యలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన ఫలితాన్ని పొందుతారు.

తుల రాశి :

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. సంతానం విద్యా విషయాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు తో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారంలో మీ ఆలోచనలు అమలు చేసి అందర్నీ ఒక మాట మీదకు తీసుకు వస్తారు. ఆస్తుల వ్యవహారంలో బంధువులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి రుణాలు తీరుస్తారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. ధార్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు అంది విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలను అందుతాయి వారం చివరన పనులలో శ్రమ కలుగుతుంది మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి.

పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి:

చేపట్టిన పనుల్లో పురోగతి కలుగుతుంది. స్నేహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది.ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ధన పరంగా స్థిరత్వం లభిస్తుంది. వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఆస్థి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఇంటాబయటా మీ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారు కుటుంబసభ్యులతో సఖ్యత పెరుగుతుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధను రాశి:

నూతన కార్యక్రమాలు ప్రారంభించిన సమయానికి పూర్తిచేస్తారు గృహమున బంధుమిత్రులు ఆగమన ఆనందం కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఇంటాబయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు బంధుమిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసివస్తాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలను స్వీకరించి మంచిది వ్యాపారాలలో గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు అన్ని రంగాల వారికి నూతన సంవత్సర కాలంగా ఈ వారం ప్రారంభంలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు చేస్తారు.

పరిహారం :దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి:

ప్రతికూల పరిస్థితులలో కూడా అనుకూలంగా మార్చుకుంటారు ఆత్మీయులతో చర్చలు చేసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అవసరానికి చేతికందుతుంది కుటుంబ వ్యవహారాలలో పనులు చాకచక్యంగా పూర్తిచేస్తారు మిత్రులతో వివాదాలు సర్దుమణుగుతాయి స్థిరాస్తి వివాదాల లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంతాన పరంగా శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నం సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ఊరట పొందారు.కొన్ని రంగాల వారికి విలువైన సమాచారం అందుతుంది వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు తప్పవు.

పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన సోది ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి:

ముఖ్యమైన పనులువాయిదా పడతాయి. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు.బంధుమిత్రులు మీ మాటను తప్పు పడతారు ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు.నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు ఆశించిన మేర లాభాలు అందటం కష్టంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది అన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్వల్ప ధన లాభసూచనలు ఉన్నవి.

పరిహారం : లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు.

మీన రాశి:

చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రులనుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి అవసరానికి డబ్బు అందుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమునకు సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు కొన్ని వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది ఇంటాబయటా మీ విలువ పెరుగుతుంది. చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలను అందుతాయి. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు.వృత్తి వ్యాపారాలలో అంచనాల అందుకుంటారు.ఉద్యోగ విషయమై అధికారులతో సమస్యలను పరిష్కరించుకుంటారు. అన్ని రంగాల వారికి కొంత అనుకూల సమయం ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.ఆరోగ్యవిషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

పరిహారం : గురు చరిత్ర పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story