వార ఫలాలు 05-06-2022 నుంచి 11-06-2022 వ‌ర‌కు

Astrology from June 4th to 11th.వార ఫలాలు 05-06-2022 నుంచి 11-06-2022 వ‌ర‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2022 2:43 AM GMT
వార ఫలాలు 05-06-2022 నుంచి 11-06-2022 వ‌ర‌కు

మేష రాశి : గృహ నిర్మాణానికి సంభందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరస్తి వివాదానికి సంబంధించి దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు. గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి.

పరిహారం: కనకధార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి : అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. శుభకార్య విషయమై ఆత్మీయులతో చర్చలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచన చేయడం మంచిది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలతో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి.

పరిహారం:విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి :చేపట్టిన పనులు కొంత జాప్యం జరిగినా ప్రధానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆత్మీయుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు కొంత తీరతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.

పరిహారం:దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి : నూతన వ్యవహారాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబంలో అందరికి ఆమోదయోగ్యంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

పరిహారం:పంచముఖ హనుమాన్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి : ఆర్థిక లావాదేవీలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఒక విషయంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. కొన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఋణ వత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

పరిహారం: శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి : చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరానికి ధన సహాయం అందుతుంది కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులతో వ్యవహారాల గురించి చర్చలు చేస్తారు వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. చిన్న తరహా పరిశ్రమలు అనుకూల వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

పరిహారం: మేధో దక్షిణా మూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. శత్రు పరమైన సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల స్థానచలన సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించటం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అధికారుల అండదండలు లభిస్తాయి. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

పరిహారం: హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి : నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ పనితీరు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి వారం చివరిలో పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు.

పరిహారం: గణపతి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధను రాశి : ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ సభ్యులు సహాయంతో సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగు పడతాయి. దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి బయట పడతారు కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి వారం ప్రారంభంలో కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి.

పరిహారం: లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి : చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దాయాదులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు ఉంటాయి.

పరిహారం: నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి : చాలాకాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. భూవివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో కలహాల సూచనలు ఉన్నవి.

పరిహారం:రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి : ఆదాయానికి మించి ఖర్చులుంటాయి నూతన రుణాలు చేస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది. బంధు మిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. చిన్న తరహా పరిశ్రమలకు చికాకులు పెరుగుతాయి, దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

పరిహారం: ఇంద్ర కృతలక్ష్మి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story