వార‌ఫ‌లాలు 26-06-2022 నుండి 02-07-2022 వ‌ర‌కు

Astrology From June 25th to July 2nd.వార‌ఫ‌లాలు 26-06-2022 నుండి 02-07-2022 వ‌ర‌కు

By జ్యోత్స్న  Published on  26 Jun 2022 2:55 AM GMT
వార‌ఫ‌లాలు 26-06-2022 నుండి 02-07-2022 వ‌ర‌కు

మేష రాశి : ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. రుణబాధల నుంచి ఉపశమనం పొందుతారు. పాత మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు.నూతన గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. అన్నిరంగాల వారికి ఉత్సహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కార్యటంకములు కలుగుతాయి.

పరిహారం : రామారక్ష స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృషభ రాశి : గృహమున కొన్ని విషయాలలో సహనం పాటించడం మంచిది.అనుకున్న వ్యవహారాలు అంచనాలకు అనుగుణంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమౌతాయి. గృహమున కొన్ని విషయాలలో సహనం పాటించడం మంచిది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు చేసుకుని బాధపడతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకుంటారు చిన్నతరహా పరిశ్రమలకు మరింత అనుకూలమైన సమయం. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి స్వల్ప. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : విష్ణు పంజర స్తోత్రం పారాయణ చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మిథున రాశి : సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని పనులలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యలు పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారస్తులకు నూతన లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలున్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.

పరిహారం : దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి ఉద్యోగాలలో చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు తప్పవు. వృత్తి వ్యాపారులకు సామాన్య లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది అన్నిరంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. వారం చివరిలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది.

పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

సింహ రాశి : గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగక ఇబ్బంది కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. స్ధిరాస్తి విషయంలో వివాదాలు నెలకొంటాయి.. నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కొన్ని రంగాల వారికి కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో సామాన్యలాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది.

పరిహారం : పంచముఖ హనుమత్ కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు అందుతాయి.

కన్య రాశి : సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీపరీక్షలలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.అన్ని రంగాల వారికీ నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

పరిహారం : గణనాయకాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి : వ్యాపార వ్యవహారంలో విజయం సాధిస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. స్ధిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. బంధు మిత్రులతో వివాదాల నుంచి బయటపడతారు. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడులు తగ్గే సూచనలు ఉన్నవి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అన్నిరంగాలవారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వారం ప్రారంభంలో బంధు మిత్రులతో విభేదాలు కలుగుతాయి.

పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధు, మిత్రులతో ఊహించని విభేదాలు నెలకొంటాయి. గృహమున ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్ధిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇంటా బయట వివాదాలకు కొంత దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. అన్నిరంగాల వారికీ అదనపు పనిఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారి యత్నాలు ముందుకు సాగవు. వారం చివరన ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

పరిహారం : రుద్ర కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : గృహమున చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా చికాకు పరుస్తాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన సమస్యలు కలుగుతాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది.

పరిహారం : లక్ష్మి సహస్రనామా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మకర రాశి : చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆస్తుల విషయంలో సోదరుతో చర్చలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా కొంత చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి. కొన్ని రంగాలవారికి నిరుత్సాహం తప్పదు. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది.

పరిహారం : మధురాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు తొలగుతాయి.అనారోగ్య సమస్యలు నుండి బయట పడతారు. పెద్దల సలహాలతో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. అన్నిరంగాల వారి అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

పరిహారం : సంతాన వేణుగోపాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మీన రాశి :వృత్తి వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి.చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు వేగవంతం చేస్తారు. కొన్ని వ్యవహారాలలో నేర్పుతో వ్యవహరించడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని రంగాల వారికీ కొత్త సమస్యలు కలుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పురోగతి పొందుతారు. సోదరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

పరిహారం : వెంకటేశ్వరస్వామి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story