వార ఫలాలు 20-06-2021 నుండి 26-06-2021

Astrology from june 20th to 26th.వార ఫలాలు 20-06-2021 నుండి 26-06-2021

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2021 4:37 AM GMT
వార ఫలాలు 20-06-2021 నుండి 26-06-2021

మేష రాశి :

ఆకస్మిక ధన లాభం సూచనలు ఉన్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలిసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. నూతన గృహ కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగ విషయమై అధికారులతో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు అనుకున్న లాభాలు పొందుతారు. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. సంతానం విద్యా విషయాల అనుకూల ఫలితాలను ఇస్తాయి. వారం మధ్యలో ఊహించని ఖర్చులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి :

చేపట్టిన పనులు కొన్ని వాయిదా పడతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన లో స్థిరత్వం ఉండదు. ఆర్థికంగా మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేసి విఫలం అవుతారు. బంధు మిత్రుల నుండి చెయ్యను పనికి నిందలు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. సంతానం విద్యా విషయాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది వారం మధ్యలో దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకు కలుస్తాయి.

పరిహారం : శివాలయ దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి :

నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు శత్రు పరమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు విరాళాలు అందిస్తారు . మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. భూ సంబంధిత విషయాల్లో చికాకులు తొలగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది వారం చివరన పనులు మందగిస్తాయి దూరప్రయాణం సూచనలున్నవి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారం : దుర్గాదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు

కర్కాటక రాశి:

కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులను అధిగమించి ముందుకు సాగుతారు. గృహ వాహన కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. స్ధిరాస్తి వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సంతానం విద్యా విషయాల శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి

పరిహారం : సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు

సింహ రాశి:

చేపట్టిన పనులలో అవరోధాలు తొలగి సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలలో కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి.సోదరులతో స్థిరాస్తి వివాదాలుపరిష్కరించుకుంటారు విద్యార్థుల విదేశీ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి వారం మధ్యలో ఊహించని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు వలన కొన్ని సమస్యలలో చిక్కుకుంటారు.

పరిహారం : నవగ్రహారాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి:

ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు.ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.ఉద్యోగ విషయంలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. నూతనోత్సాహంతో కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు అందుతాయి. అన్ని రంగాల వారికి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి వారం మధ్యలో స్వల్ప ధనవ్యయ సూచనలున్నవు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.

పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు

తుల రాశి :

నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.ఆర్థికంగా మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రుణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము చేతికందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి నిరుద్యోగులకు అధికారులు ఆదరణతో నూతన అవకాశాలు అందుతాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

పరిహారం : లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు

వృశ్చిక రాశి:

నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.ఆర్థికంగా మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రుణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము చేతికందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి నిరుద్యోగులకు అధికారులు ఆదరణతో నూతన అవకాశాలు అందుతాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

పరిహారం : లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధను రాశి:

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మీయుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులకు మీ నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తీరి ఊరట పొందుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు సేవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవాంతరాలు తొలగుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఊహించని ధన వ్యయాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి.

పరిహారం : గణపతి ఆరాధన చేయడం వలన ఈ ఫలితాలను పొందుతారు

మకర రాశి:

వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహమున వివాహాది శుభకార్య నిర్వహిస్తారు. ఇంటా బయట సమస్యలను తెలివిగా పరిష్కరించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు అందుకుంటారు. కొన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వారం చివరలో కొన్ని పనులు మందగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి.

పరిహారం : మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు

కుంభ రాశి:

ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ధైర్యంగా బయటపడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలులో అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి కష్టానికి తగిన ఫలితం పొందుతారు . ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి.

పరిహారం : ఆంజనేయస్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి :

చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సోదరులతో వివాదాలు రాజీ అవుతాయి.దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు.ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలులాభసాటిగాసాగుతాయి ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.విద్యార్థుల విదేశీ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత కష్టం మీద పూర్తవుతాయి. కొన్ని రంగాలవారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వారం ప్రారంభంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

పరిహారం : నరసింహ స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story