వార ఫలాలు 13-06-2021 నుంచి 19 -06-2021 వరకు

Astrology from june 13th to 19th.వార ఫలాలు 13-06-2021 నుంచి 19 -06-2021 వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2021 4:15 AM GMT
వార ఫలాలు 13-06-2021 నుంచి 19 -06-2021 వరకు

మేష రాశి :

గ్రహాలు అనుకూల సంచారం వలన ఆశించిన ఫలితాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారములందు జయం. వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణించును. ఉద్యోగులుకు అధికారుల ఆదరణ పెరుగి ప్రమోషన్స్ పొందుదురు. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ నాయకులుతో చర్చలు అనుకూలిస్తాయి, సంఘంలో ప్రముఖుల పరిచయాలు విస్తృతమవుతాయి. సంతాన విద్య ఉద్యోగ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధువులతో విరోదములు. మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు.

పరిహారం : పార్వతి దేవికి కుంకుమ పూజ,శివాలయంలో అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి :

ఈ వారంలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఇంటా బయట ముఖ్యమైన వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాల యందు అనుకూలత పెరుగుతుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున విలువైన పత్రాలు విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

పరిహారం : సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి:

ఈ వారం ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందలేరు. ఆర్థికంగా మరింత సమస్యలు పెరుగుతాయి, ఇంటా బయట ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మనోధైర్యం కోల్పోతారు. బంధుమిత్రుల ప్రవర్తన వలన కొంత మానసికంగా భయాందోళనకు గురి అవుతారు. చేపట్టిన పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. రాను రాను పరిస్థితులు చక్కబడతాయి రంగంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి అవసరానికి ఇతరుల నుండి ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం ఉంటుంది.

పరిహారం: మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయటం వలన కలిగే ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి:

మీకు ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తన సహాయం అందుతుంది. జన్మ రాశిలో శని సంచారం వలన చేపట్టిన ప్రతి పనిలో ఉన్న చికాకులు పెరుగుతాయి. ప్రతి చిన్న విషయానికి కోపం పోతుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరులను తక్కువ అంచనా వేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు ఉంటాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. అయితే కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహమున బంధు మిత్రులు ఆగమన ఆనందం కలిగిస్తుంది.

పరిహారం: దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి:

వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. వర్గాల సమస్యల నుండి బయటపడతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. గృహమున స్థానచలన సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. శత్రువులు కూడా మిత్రుల వలే సహాయ పడతారు. అయితే ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. నిరుద్యోగులు ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

పరిహారం: రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి:

వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి. చేపట్టిన ప్రతి పనిలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. దూర ప్రయాణాలలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సంతాన విద్య ఉద్యోగ విషయాలలో అనుకూల పరిస్థితులు కలుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వాతావరణం సంతోషకరం గా ఉంటుంది. మధ్యలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నిదానంగా అధిగమిస్తారు

పరిహారం:హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి:

చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల విషయంలో సంప్రదింపులు చేయడం మంచిది. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు ఇతరుల నుండి వస్తుంది. నిందలు పడవలసి వస్తుంది. రాను రాను గ్రహాలు అనుకూలంగా పని చేయడం వలన చేపట్టిన పనుల యందు విశేషమైన లాభాలను ఉంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగి సఖ్యత కలుగుతుంది. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇంట, బయట సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో ఆశించిన మార్పులు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

పరిహారం: హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి:

చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఉత్సాహ వాతావరణం ఉంటుంది. మంచి మాట తీరుతో ఇంటాబయటా అందరినీ ఆకట్టుకుంటారు బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జీవిత భాగస్వామితో వివాదాలు. ఉద్యోగస్తులైతే మీకు రావలసిన గుర్తింపు వేరే వారికి రావటం వలన నిరుత్సాహం పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. శత్రు సంబంధిత సమస్యలు మరింత బాధిస్తాయి.

పరిహారం: వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.


ధను రాశి:

శారీరక శ్రమ పెరుగుతుంది ప్రతి చిన్న పనికి అలసట కలుగుతుంది. సమయానికి నిద్రాహారాలు ఉండవు. గృహంలో మార్పులు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వాహన ప్రమాదం సూచనలు ఉన్నది. మాతృ వర్గం వారితో వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. భూ సంబంధిత క్రయ విక్రయాలు కలిసిరావు. సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి, వ్యాపార పరంగా కొంత మందకొడిగా సాగుతాయి. గృహామున వివాహాది శుభకార్య ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధనలాభం సూచనలు. న్

పరిహారం: నవగ్రహ కవచం పారాయణం చేయటం వలన శుభ ఫలితాన్ని పొందుతారు ఆ తర్వాత ఏం చేసుకుంటారు.

మకర రాశి:

ప్రతి చిన్న విషయానికి కోపం పెరుగుతుంది. ఇంటా బయట అందరితో కఠినంగా వ్యవహరిస్తారు. మీ ప్రవర్తన కారణంగా సహాయం చేసేవారు వారు కూడా వెనకడుగు వేస్తారు. సోదర వర్గం వారితో స్ధిరాస్తి విభేదాలు కలుగుతాయి. సంతానం విద్యా విషయాల లో తీసుకున్న నిర్ణయాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు. వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలలో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు గృహ నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

పరిహారం: వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి:

చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికంగా మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధుమిత్రుల శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్త్రీ సంబంధిత లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి లాభాలను అందుకుంటారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

పరిహారం: మధురాష్టకం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి:

వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలనుండి తెలివిగా బయటపడతారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వారిని కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. రాజకీయ వర్గం నుండి సహాయం అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగి సఖ్యత పెరుగుతుంది బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు సహకారం అవుతాయి. ప్రమోషన్ అందుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది.

పరిహారం: కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story