వార ఫలాలు 25-07-2021 నుండి 31-07-2021వరకు

Astrology from July 25th to 31st.వార ఫలాలు 25-07-2021 నుండి 31-07-2021వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2021 2:42 AM GMT
వార ఫలాలు 25-07-2021 నుండి 31-07-2021వరకు

మేష రాశి :

చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. శత్రువుల నుండి కూడా ఊహించిన సహాయ సహకారాలు అందుతాయి. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి:

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలను అధిగమిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరలో పనుల ఒత్తిడి అధికమవుతుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

పరిహారం: ఆంజనేయస్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి:

ఇంట్లో కొందరరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. సంతాన విద్యా విషయాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని రంగాల వారికి చాలా కాలంగా రావాల్సిన అవకాశాలు అందుతాయి వారం ప్రారంభంలో బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయాలను అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

పరిహారం: గణపతి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి :

నిరుద్యోగులు కలలు సాకారం అవుతాయి. సంతానం విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు పొందుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు సహోద్యోగులతో సమస్యలు పరిష్కారమవుతాయి. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి పరిహారం:

పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి:

గృహమున శుభకార్యాల గూర్చి సోదరులతో చర్చలు జరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో అవరోధాలను అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఇంటాబయటా మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వారం మధ్యలో కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకోవడం వల్ల ఇబ్బందులు తప్పవు.

పరిహారం: రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి:

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనులలో శ్రమ అధికం అవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు కొంత బాధ కలిగిస్తాయి సోదరులతో స్థిరాస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు కలుగుతాయి. అన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పరిహారం:

పరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి:

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకూ తీర్చగలుగుతారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు మరింత విస్తృతమౌతాయి.నిరుద్యోగులు కొంత కష్ట పడవలసి రావచ్చు. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుని బాధపడతారు. ధార్మిక సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రయత్నాలు సఫలమౌతాయి. వారం చివరలో ధన పరమైన ఒడిదుడుకులు కలుగుతాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

పరిహారం: నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి:

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దూరప్రాంత బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ విషయాలలో మీరు తీసుకున్న నిర్ణయం అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి వారం చివరన వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.

పరిహారం: దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయుట శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి:

పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల సహాయంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వారం చివరలో బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు.

పరిహారం: శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి:

అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాల నుంచి బయటపడతారు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఉద్యోగులుకు ఆశించిన పదోన్నతులు లభిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి. వారం చివరన పనులు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నవి.

పరిహారం: నరసింహ స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి:

కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కారమౌతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు.నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు భాగస్థుల నుండి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారం ప్రారంభంలో మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులుంటాయి . చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

పరిహారం: దుర్గా దేవి ఆరాధనా చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మీన రాశి:

ఆర్థికంగా కొంత అనుకూలత పెరుగుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ సమస్యలు క్రమక్రమంగా తొలగుతాయి. స్ధిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. సోదరులతో సఖ్యత వ్యవహరిస్తారు. నూతన వాహనసౌఖ్యం కలుగుతుంది.సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయం భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో మరింత పురోగతి సాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది . అన్ని రంగాల వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ధనవ్యయ సూచనలు ఉన్నవి.. బంధు వర్గంతో వివాదాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నవి.

పరిహారం: సుబ్రమణ్య స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story