వారఫలాలు 18 జులై నుంచి 24 జులై వరకు

Astrology from july 18th to 24th.వారఫలాలు 18 జులై నుంచి 24 జులై వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2021 6:07 AM GMT
వారఫలాలు 18 జులై నుంచి 24 జులై వరకు

మేష రాశి:

ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆప్తులతో వివాదాలు పరిష్కారమవుతాయి స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ధన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

పరిహారం : గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి:

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు కొంత సర్దుబాటు అవుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. గృహ నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అవాంతరాలు తొలగుతాయి.నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని స్థాన చలన సూచనలు ఉంటాయి.నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. కొన్ని రంగాల వారికి కీలక సమాచారం అందుతుంది. వారం చివరిలో కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

పరిహారం : నవగ్రహారాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిధున రాశి:

అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఆత్మీయులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. తగిన ప్రణాళిక రూపొందించి కీలక వ్యవహారాలలో విజయం సాదిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. విలువైన వస్త్రా, ఆభరణాలుకొనుగోలుచేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతంచేస్తారు. వృత్తి, వ్యాపారాలుఅనుకూలంగా సాగుతాయి ఉద్యోగ విషయమై అధికారులు సహాయంతో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలత కలుగుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాహన ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారం : గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి:

సమస్యలను ధైర్యంగా అధిగమిస్తారు. పాత మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ఉన్నత స్థితి కలుగుతుంది భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలమౌతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాల అందుతాయి. వారాంతమున ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

పరిహారం : సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

సింహ రాశి:

గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది సేవ కార్యక్రమాలలో ఉత్సాహంతో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. సంఘంలో పెద్దలనుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మీ నిర్ణయాలు అందరు గౌరవిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ చూపించి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు కొత్త పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

పరిహారం: దుర్గా దేవి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కన్యా రాశి:

బంధుమిత్రుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి.వ్యాపారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనుఇస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబ సమస్యల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.

పరిహారం :ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

తుల రాశి:

ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు.ఆదాయ మార్గాలు మెరుగు పడతాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఇంటాబయటా అనుకూల వాతావరణంఉంటుంది.నూతన గృహం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహమున వివాహ శుభకార్యాలు గూర్చి చర్చలు జరుగుతాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టి లాభాలను పొందుతారు. కొన్ని రంగాల వారికి మరింత గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత బాధ కలిగిస్తుంది.

పరిహారం : ఆదిత్య కవచం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు

వృశ్చిక రాశి:

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు ఉద్యోగమున చికాకులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. చిన్నతరహాపరిశ్రమలకు ప్రభుత్వం నుండి సహాయం అందుతుంది మంచి ఆలోచన జ్ఞానంతో సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది ఇతరుల సమస్యలు సైతం పరిష్కరిస్తారు. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వారంచివరిలో వృధాఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి.

పరిహారం :హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనురాశి :

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన కొన్ని పనులు పూర్తి చేస్తారు. గృహమున శుభకార్య ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది. కుటుంబ విషయమై తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంటాబయటా ఉత్సహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. వారం మధ్యలో అనారోగ్య సమస్యలుబాధిస్తాయి. మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి.

పరిహారం: గణపతిని ఆరాదించండం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి:

ప్రణాళికతో పనులు రూపొందించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు చేపట్టిన వ్యవహారాలలో ఆలోచన కార్యరూపం దాలుస్తాయి దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలయ దర్శనాలు చేస్తారు స్ధిరాస్తి వ్యవహారాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేస్తారు గృహనిర్మాణ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ విషయమై అధికారులతో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది. వారం మధ్యలో స్వల్ప ధనవ్యయ సూచనలు ఉన్నవి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

పరిహారం : లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి:

చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల విషయంలో సంప్రదింపులు చేయడం మంచిది. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు ఇతరుల నుండి వస్తుంది. నిందలు పడవలసి వస్తుంది. రాను రాను గ్రహాలు అనుకూలంగా పని చేయడం వలన చేపట్టిన పనుల యందు విశేషమైన లాభాలను ఉంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగి సఖ్యత కలుగుతుంది. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇంట, బయట సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో ఆశించిన మార్పులు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

పరిహారం: హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.

మీన రాశి:

సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు పుంజుకుంటాయి. కొన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో పనులు మందగిస్తాయి. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి మిత్రులతో వివాదాలు ఉంటాయి.

పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story