వార ఫలాలు 11-07-2021 నుంచి 17 -07-2021 వరకు

Astrology from July 11th to 17th.వార ఫలాలు 11-07-2021 నుంచి 17 -07-2021 వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2021 2:00 AM GMT
వార ఫలాలు 11-07-2021 నుంచి 17 -07-2021 వరకు

మేషరాశి:

కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. అందరి నుండి ప్రోత్సాహం బాగా అందడమే కాకుండా కొత్త వ్యాపార వ్యవహార చికాకుల పరిష్కారాల మీద దృష్టి సారిస్తారు . ఉద్యోగ విషయంలో చిన్న చిన్న చికాకులు ఉత్పన్నమౌతాయి . అయితే మీకు మీ పై అధికారుల సహకారం ఉండడం వలన సమస్యలను దాటవేయగలుగుతారు. కీర్తి ప్రతిష్ఠలకు యిబ్బంది లేకుండా గౌరవప్రదమైన జీవనం సాధిస్తారు. సాంఘిక కార్యకలాపాలు మీకు లాభిస్తాయి. మీకు మీ దగ్గర పనిచేయువారు సహకరిస్తారు శుభవార్తలు వింటారు. సమయాన్ని వృధా చేయకుండా కాలాన్ని సానుకూలం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం శుభపరిణామం ఇస్తుంది.

వృషభం రాశి:

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇతరుల వ్యవహారములలో కలుగ చేసుకోవద్దు. ఒక్కోసారి ఆర్థిక లావాదేవీలు బాగా జరిగి మీరు చాలా ఆనందంగా కాలం గడుపుతుంటారు. ఆదాయం రావలసిన స్థాయికి తగిన రీతిగా అందుకుంటారు. ఖర్చులు అధికం అవుతాయి. భోజన, వస్త్ర విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. అలాగే వ్యాపారులకు కూడా సత్ఫలితాలు అందుతాయి. విద్యానిమిత్తంగా విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి ఫలితాలు బాగుంటాయి. కన్స్ట్రక్షన్ రంగంలోను, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక ఒత్తిడి ఉంటుంది . ఫైనాన్స్ వ్యాపారులు అప్పు ఎగవేత దారులు ఉంటారు జాగ్రత్త వహించాలి.

పరిహారం: గురు చరిత్ర పారాయణ చేయడం మంచిది.

మిథునం రాశి:

మీరు ఎవరితోను అధికంగా చర్చలు సాగించవద్దు. ఉద్యోగస్తులకు ఏ పని చేసినా గుర్తింపు రాకపోవడం, ఉద్యోగ రీత్యా తోటివారితో యిబ్బందులకు గురి అవ్వడం వంటివి జరుగుతాయి. వ్యాపారులకు ఆశించిన రీతిగా లాభాలు వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. అనవసరంగా అగ్ని, చోర, రాజభయములకు గురి అయ్యే అవకాశం ఉన్నది. భవిష్యత్తులో కొన్ని కొత్త కొత్త పరిచయాలు కలుగుతాయి. విద్యా విషయముగా విదేశాలకు వెళ్ళేవారికి అనుకూలం. కన్స్ట్రక్షన్ రంగంలో మరియు రియల్ ఎస్టేట్ రంగంలో వారు చాలా చికాకులు పొందుతారు. ఫైనాన్స్ వ్యాపారులు అధికైన జాగ్రత్తలు పాటింపవలసిన కాలము. మొండిబాకీలు పెరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలలో వున్నవారికి సత్ఫలితాలు అందుతాయి.

పరిహారం: విష్ణుమూర్తి ని ఆరాధిస్తూ, బుధవారం నియమాలు పాటించండి.

కర్కాటకం రాశి:

సహజంగా ఉద్యోగ విషయాలు శోధిస్తే మీకు యితరుల సహకారం బాగుంటుంది. తద్వారా అభివృద్ధి లేకపోయిననూ నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది. వ్యాపారులు కూడా ఆశించిన రీతిగా వ్యాపారం చేయలేరు తగిన లాభాలు అందుకోలేరు. కేవలం వృత్తి విషయాలే కాదు. సామాజిక కార్యక్రమముల విషయంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతుంటాయి. కొన్ని సందర్భాలలో ప్రయత్నాలు వైఫల్యం యిస్తాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. విద్యా విషయంగా విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు అయినా పనులు పూర్తి అవుతాయి. కానీ ధనవ్యయం కాల వీలంబం ఎక్కువ అవుతుంది. కన్స్ట్రక్షన్ రంగంలోను, రియల్ ఎస్టేట్ రంగంలో వున్నవారు శ్రమ ఎక్కువ చేసి సత్ఫలితాలు అందుకుంటారు. ఫైనాన్స్ వ్యాపారులు ధైర్యంగా ఉండచ్చు. అవసరానికి తగిన ధనం సమయానికి అందడం, అదేరీతిగా ప్రోత్సాహకరమైన వాతావరణం అన్ని అంశాలలో ఉండడం ద్వారా మంచి ఫలితాలు అందుతాయి.

పరిహారం: వినాయకుడిని ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు

సింహం రాశి :

దీర్ఘకాల సమస్యలు ఉన్నవారు క్షణం వృథా చేయ కుండా సమయం సానుకూలం చేసుకోవాలి. గృహనిర్మాణం వంటి ఆలోచనలు వున్న వారికి కోరికలు తీరతాయి. దైనందిన కార్యక్రమములు అన్నీ చేసుకుంటారు. కానీ ఆర్థిక వనరులు సరిగా సమకూరవు. ఆదాయం తక్కువ స్తాయిగాను ఖర్చులు అధిక స్థాయిలోను ఉంటాయి. అధికారులు బాగా సహకరిస్తారు. తద్వారా ఉద్యోగ వ్యాపార విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. అనుకున్న ఫలితాలు వృత్తి విషయంలో అందుకుంటారు. యితరులకు కూడా పూర్తిగా సహకరిస్తారు. సాంఘిక కార్యకలాపాల ద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమస్యలకు భయపడకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వాహనములు నడిపేటప్పుడు జాగ్రత వహించాలి.వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. పనులలో శ్రమ అధికం అవుతుంది.

పరిహారం: ఆంజనేయస్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి :

స్థిరాస్తికి సంబంధించిన వ్యాజ్యములు వున్నవారికి ఈ సంవత్సరం అనుకూలం తక్కువ. ఎవరి విషయాలలో కలుగచేసుకోకుండా కేవలం వారి స్వకార్యములు మాత్రమే చేసుకునేవారు సుఖించే అవకాశం ఉంటుంది. కేవలం ఆర్థిక అంశాలు మీ మానసిక ప్రవృత్తిని మార్పు చేస్తాయి. ఆస్తి వ్యవహారముల విషయంగా చర్చలు సాగింపవద్దు. అధికారుల ఒత్తిడి ఎక్కువ అవుతాయి. అవకాశమును బట్టి వర్కర్స్ మీద ఆధారపడడం మానివేయడం మంచిది. అనవసరప్రయాణాలు, ఖర్చులు నియంత్రించుకోండి విద్యావిషయంగా విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి అనుకూలము. అయితే ఉద్యోగ విషయంగా వెళ్ళేవారి విషయంలో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కన్స్ట్రక్షన్ రంగంలోను, రియల్ ఎస్టేట్ రంగంలోను వున్నవారు సాధారణ స్థాయి ఫలితాలు అందుకుంటారు. కొన్ని వ్యవహారాలలో చిన్నపాటి మార్పులతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

పరిహారం: దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తులరాశి:

మీ స్నేహితులు సహకారం చేయడం జరుగుతుంది. మీరు వ్యాపారం చేయు స్థలం నుండి ఖాళీ చేయించే విషయంగా కలహబాధ పెరుగుతుంది. అధికారులు మీ ఉద్యోగ వ్యాపార విషయాలలో తరచుగా యిబ్బందులు కలుగచేస్తారు. అనవరస ప్రమాణములు చేస్తుంటారు. ఆదాయం తగిన రీతిగా అందుతూ ఉంటుంది. ఖర్చులు అధికం అవుతాయి. శుభ కార్యములు పుణ్య కార్యములు నిమిత్తంగా ప్రయాణ విఘ్నములు అధికంగా అవుతాయి. వృత్తి విషయంలో కొన్ని సందర్భాలు బహు అనుకూలంగా వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలకై ప్రయత్నం చేయు వారు ఉద్యోగం మానివేసి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు చేయకండి. కన్స్ట్రక్షన్ రంగంలోను రియల్ ఎస్టేట్ రంగంలోను వున్నవారికి లేబర్ ప్రాబ్లమ్, మధ్యవర్తుల వలన చికాకులు బాగా పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అంది నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు వారం ప్రారంభంలో బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి మానసికంగా అశాంతి కలుగుతుంది.

పరిహారం: రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చికం రాశి:

అనవసర ప్రయాణాలు చేస్తారు. ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉంటారు. ఈ రాశివారు ఎవరైతే ఓర్పుగా వ్యవహరిస్తారో వారికి లాభాలు తప్పవు. ఉద్యోగం విషయంలో దూకుడు పనికిరాదు. ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది. వ్యాపారుల విషయంలో సానుకూల ఫలితాలు తక్కువ అయితే నష్టాలు పెద్దగా ఉండవు. ఉద్యోగ విషయాలలో బాగా అనుకూలిస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు కచ్చితంగా సానుకూలమే అవుతాయి. కన్స్ట్రక్షన్ రంగంలోను రియల్ ఎస్టేట్ రంగంలో వున్నవారికి చాలా విచిత్ర స్థితి ఉంటుంది. వీరికి ఆర్థిక వెసులుబాటు వున్ననూ అసంతృప్తి బాగా వెంబడిస్తుంది. ఫైనాన్స్ వ్యాపారులు తెలివిగా మంచి లాభాలు అందుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు మరియు పుణ్యక్షేత్ర సందర్శన కలదు. అయితే కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు కొంత కలవరపరుస్తాయి.

పరిహారం: రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధను రాశి:

ఒక విచిత్రమైన అనుభూతులు కలిగే అవకాశం ఉన్న కాలము. అలాగే ప్రశాంతచిత్తంతో నడిచి విజయాలు సాధించే అవకాశం యిస్తారు. కొన్నిచోట్ల ధైర్యం ప్రదర్శిస్తారు. సందర్భానుసారంగా వ్యవహరిస్తారు. కానీ కార్య నష్టములకు అవకాశం లేదు. సుఖజీవనం చేస్తారు. యశోవృద్ది కలుగుతుంది. ధర్మ కార్యములు చేయడం తద్వారా చక్కగా ఆనందించడం జరుగుతుంది. చేస్తున్న ఉద్యోగ వ్యాపార విషయాలు విడిచి కొత్త ప్రయత్నాలు చేయవద్దు. ఆర్థిక కార్యకలాపాలు అనుకూల స్థితి ఉంటుంది. ఆదాయం వ్యయం అంతా కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు తేలికగా పూర్తి అవుతాయి. విద్యా విషయంగా వెళ్ళే వారికి కొంచెం అవరోధములు కలవు.వారం ప్రారంభంలో బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి మానసికంగా అశాంతి కలుగుతుంది.

పరిహారం: ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి:

మీరు చాలావరకు సమస్యలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న కాలము. కొన్ని సందర్భాలలో లాభాలు అధిక స్థాయిగా వస్తాయి. కొన్ని ప్రయత్నాలు తేలికపాటివి కూడా పూర్తి అవ్వవు. ఉద్యోగ విధి నిర్వహణ మీరు ఎంత బాగా చేసినా గుర్తింపురాదు. అంతేకాక తోటి ఉద్యోగులు, పై అధికారులు తరచుగా ఆగ్రహిస్తారు. యిక వ్యాపారులకు ఆశించిన మేర శుభ పరిణామాలు అందవు. కానీ మంచి వ్యాపారమే జరుగుతుంది. ఆర్థిక వనరులు అస్తవ్యస్తంగా ఉన్ననూ యిబ్బందికరం కాదు. ఆదాయం కొన్నిసార్లు బాగుండి కొన్నిసార్లు చికాకులను కలిగిస్తూ ఉంటుంది. ఖర్చులు నియంత్రించలేని పరిస్థితి ఉంటుంది. చాలావరకు మీరు అందర్నీ గౌరవించి మీరు గౌరవ మర్యాదలు అందుకుంటూ ముందుకు వెడతారు. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వారం ప్రారంభంలో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి సోదరులతో ఊహించే కలహాలు పెరుగుతాయి.

పరిహారం: గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభం రాశి:

ఇకపై యితరుల వ్యవహారములలో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. గౌరవ మర్యాదలకు యిబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగ విషయంలో అందరితో కలహములు పెరుగుతాయి. సకాలంలో విధి నిర్వహణ చేయలేక ఉద్యోగ భంగం పొందినా ఆశ్చర్యం లేదనే చెప్పాలి. అధికారుల నుండి ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారులకు కూడా సంతృప్తికరంగా వ్యాపారం లేకపోగా ఆర్థిక లావాదేవీలు వ్యాపారాన్ని యిబ్బంది పెడతాయి. ఆదాయం తక్కువ ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రతిపనిలోను విశేషమైన ఖర్చులు ఉంటాయి. ప్రయాణ విఘ్నములు ఎక్కువ. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్న వారికి చికాకులు చాలా ఎదురౌతాయి.వారం మధ్యలో వృథాఖర్చులు చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. దగ్గరి ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

పరిహారం: సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీనం రాశి :

ఇకపై అన్ని కోణాలలోను శ్రమకు తగిన ఫలితాలు చక్కగా అందుతాయి. మీ యొక్క ఆర్థిక కార్యకలాపాలు యిబ్బంది లేకుండా నడచిపోతాయి. ఆదాయం, వ్యయం రెంటినీ సమర్థంగా నిర్వహిస్తారు. అనవరస ఖర్చులు నియంత్రిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణ బాగా సాగుతుంది. తోటివారి సహకారం మరియు పై అధికారుల సహకారం బాగుంటాయి. మీ యొక్క వ్యాపార విషయాలు కూడా నష్టం లేకుండా చక్కగా జరుగుతాయి. విజ్ఞాన వినోద కార్యములలో పాల్గొంటారు. గృహనిర్మాణ యోచన బాగా సాగుతుంది. సాంఘిక కార్యకలాపాల యందు తరచుగా పాల్గొంటారు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు చాలావరకు సానుకూలమే. అందులోను విద్యాపరంగా వెళ్ళేవారికి సంవత్సరం అంతా అనుకూలమే. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నవి ఇతరులకు ధన విషయంలో మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ వాతావరణం మాత్రం కాస్త గందరగోళంగా ఉంటుంది.

పరిహారం: మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Next Story