వారఫలాలు 30-01-2022 నుంచి 05-02-2022 వరకు
Astrology From January 30th to February 5th.వారఫలాలు 30-01-2022 నుంచి 05-02-2022 వరకు
By జ్యోత్స్న Published on 30 Jan 2022 8:14 AM ISTమేషం రాశి : చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయట తెలివిగా వ్యవహరించి అందర్నీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉండి దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత వరకు బయటపడతారు. వ్యాపారాలలో నూతన ఆశలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.
పరిహారం : హయాగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృషభ రాశి : ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. స్థిరస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి.ముఖ్య వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి.కీలక వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు రాజి అవుతాయి. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి.
పరిహారం : శ్రీ రామ రక్షస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
మిథున రాశి : ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగుపడుతుంది. ఎంతటి పనినైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. సంతాన వివాహాది ప్రయత్నాలు సఫలమవుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. కొన్ని రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు ఉంటాయి. సోదరులతో వివాదాలు కొంత బాధిస్తాయి.
పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కర్కాటక రాశి : మరింత ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. నూతన వాహన లాభమున్నది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మధ్యలో నిలిచిపోయిన గృహ నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.ఉద్యోగాలలో ఆర్థిక పురోగతి కలుగుతుంది. వారం మధ్యలో శ్రమ పెరుగుతుంది. వృధాఖర్చులు పెరుగుతాయి.
పరిహారం : గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
సింహ రాశి : కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. బంధు , మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఆప్తుల నుండి అందిన ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ , వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి. వారం మధ్యలో ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. శుభకార్యాలలో పాల్గొంటారు.
పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కన్య రాశి : ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం చివరిలో బంధువులతో అకారణ వివాదాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తుల రాశి : ఆర్థిక వ్యవహారాలు మరింత సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. సోదరులు, మిత్రులతో చర్చలు అనుకూలంగా సాగుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ధనవ్యయం సూచనలు ఉన్నవి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
పరిహారం : కాలభైరవ అష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
వృశ్చిక రాశి : అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఒక వ్యవహారంలో స్వంత ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో బంధువర్గంతో వివాదాలు ఉంటాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు.
పరిహారం : విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
ధనస్సు రాశి : ఇంటా బయట చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.
పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మకర రాశి : కుటుంబ సమస్యల అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తెలివిగా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. చిన్న తరహా పరిశ్రమల వారి ప్రయత్నాలు సఫలమౌతాయి వారం ప్రారంభంలో ధనపరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
పరిహారం : సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
కుంభ రాశి : కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. సన్నిహితులతో కష్టసుఖాలు విచారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆలయాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగ విధుల్లో సమస్యలను అధికారుల సహాయంతో పరిష్కరించుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు తొలగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.
పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
మీన రాశి : ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు కొన్ని విషయాలలో కలసివస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సోదరులతో సమస్యలు పరిష్కారమౌతాయి. ఆస్తుల వ్యవహారంలో ఒడిదుడుకులు తొలగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి బయటపడతారు. ప్రభుత్వ అధికారుల ఆదరణ లభిస్తుంది. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.
పరిహారం : రాజరాజేశ్వరి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.