వారఫలాలు 2-01-2022 నుంచి 8-01-2022

Astrology from January 2nd to 8th.వారఫలాలు 2-01-2022 నుంచి 8-01-2022

By జ్యోత్స్న  Published on  2 Jan 2022 2:30 AM GMT
వారఫలాలు 2-01-2022 నుంచి 8-01-2022

మేషం రాశి : ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పాత మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారులు అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఆర్థిక పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కిందిస్థాయి ఉద్యోగుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది దూరప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

పరిహారం : లక్ష్మీ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి : ఈ రాశి వారికి అంతగా అనుకూలత లేదు. బంధు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చెయ్యవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని స్థానచలన ఉంటాయి. గృహమున ఆకస్మిక మార్పులు చేస్తారు. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాల వలన నష్టాలు తప్పవు. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పవు. చిన్ననాటి మిత్రుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఆనందం కలిగిస్తాయి.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

పరిహారం : శివాలయం లో రుద్రాభిషేకం చేయించి శివ పంచాక్షరీ మంత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి : ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ఏదోవిధంగా ధనం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులను కలుసుకుని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమునకు బంధుమిత్రుల ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగం ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్నపాటి ప్రయత్నంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు రాజి చేసుకుంటారు.

పరిహారం : దుర్గ అమ్మవారికి ఖడ్గమాల కుంకుమ పూజ, గణేశాష్టకం పారాయణం చేయించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని ఊహించని సంఘటనలు వలన మానసిక చికాకులు అధికమవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. శత్రు సమస్యల నుంచి బయటపడతారు. గృహమునకు దూరపు బంధువులు ఆగమనం కలిగిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

పరిహారం : ఆంజనేయ స్వామికి మన్యు సూక్త సహిత సింధూరముతో పూజ చేయించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహ రాశి : ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగవుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి బంధుమిత్రులతో దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నూతన గృహ నిర్మాణానికి బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

పరిహారం : వినాయకునికి గరిక గడ్డి, సింధూరంతో పూజ చేయించడం వలన శుభఫలితాలను పొందుతారు.

కన్య రాశి : ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది చేపట్టిన పనులలో చిన్నపాటి అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుడు ఆగమన ఆనందం కలిగిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి. గృహనిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి ప్రయాణాలు వాయిదా పడతాయి.

పరిహారం : సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన శుభఫలితాలను పొందుతారు .

తుల రాశి : ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది. చాలా కాలంగా బాధిస్తున్న ఇటువంటి అనారోగ్యాలను నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ధైర్యం తో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతోఉన్నటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి కోర్టు సంబంధిత వివాదాల నుండి బయట పడతారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుండి పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది. ధన పరంగా మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు.

పరిహారం : రాజరాజేశ్వరీ దేవి దర్శనం చేసుకుని స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది పాత రుణాలు కొంతవరకూ తీర్చ గలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఇతరులకు కూడా సహాయసహకారాలు అందించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.

పరిహారం : వెంకటేశ్వరస్వామి ఆలయంలో విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. ఇంటాబయట కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి. చేపట్టిన కార్యక్రమాలు కొంతమందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలను తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. స్థిరస్తి వ్యవహారాలలో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసిరావు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి.

పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేస్తూ సూర్యునికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించడంవల్ల శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి : గ్రహ స్థితి అనుకూలంగా లేనందున అంతగా కలసిరాదు. ఏ పని చేపట్టిన అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ పెరుగుతుంది . ఇతరులతో మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో సరైన అవగాహన లేక వివాదాలు అధికమవుతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ధన ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ఋణ ఒత్తిడి అధికామౌతుంది.ఒక వ్యవహారంలో బంధు మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.నూతన వస్త్రాభారణాలు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

పరిహారం : శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి : ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేదు వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగుతాయి ఆర్థికపరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు శత్రు పరమైన సమస్యలు కొంతవరకు బాధిస్తాయి. నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది పనిభారం అధికమై సమయానికి నిద్ర హారాలు ఉండవు. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. ఋణ దాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో విందువినోదాలు కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం విద్యా విషయాల కొంత అనుకూలిస్తాయి.

పరిహారం : నవగ్రహ ప్రదక్షణ చేసి గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

మీన రాశి : ఈ రాశి వారికి చాలా బాగుంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కొన్ని వివాదాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మీ గౌరవ మర్యాదలకు ఉండదు. ఆర్థిక పురోగతి కలుగుతుంది గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. అన్ని రంగాల వారికి ఆశించిన పురోగతి కలుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

పరిహారం : కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు

Next Story