వారఫలాలు 23-01-2022 నుంచి 29-01-2022 వరకు

Astrology from January 23rd to 29th.వారఫలాలు 23-01-2022 నుంచి 29-01-2022 వరకు

By జ్యోత్స్న  Published on  23 Jan 2022 2:39 AM GMT
వారఫలాలు 23-01-2022 నుంచి 29-01-2022 వరకు

మేషం రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తొలగి ఊరటపొందుతారు. స్థిరస్తి వివాదాల నుంచి బయటపడతారు. దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి వారం మధ్యలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : దత్త పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

వృషభ రాశి: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఇంటాబయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సంతానం విద్య విషయాలపై దృష్టి పెట్టాలి. బందు మిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగక నిరుత్సాహపరుస్తాయి వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన,వస్తులాభాలు పొందుతారు.

పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశి: నూతన పనులకు శ్రీకారం చుడతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ధన వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసివస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వ్యాపారస్తులు నూతన అవకాశాలను దక్కించుకుంటారు. వారం మధ్యలో గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు, నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు జరుగుతాయి. వారం చివరిలో వృధా ఖర్చులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

కర్కాటక రాశి: సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిస్తుంది. సన్నిహితుల నుంచి ఆశించిన ధన సాయం అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ఇంట బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

సింహ రాశి: దూరపు బంధువుల నుండి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సంతాన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి వారం మధ్యలో కుటుంబ సభ్యులతో ఆస్తివివాదాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : రాజరాజేశ్వరీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

కన్య రాశి: ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. సన్నిహితుల నుండి అందిన ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు విస్త్రుతమవుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సన్నిహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో నూతన పదవులు పొందుతారు ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది వారం మధ్యలో ప్రయాణాలు వాయిదా పడతాయి. క్రయ విక్రయాలకు సంబంధించిన ఒప్పందాలు నిరుత్సాహపరుస్తాయి.

పరిహారం : సుబ్రహ్మణ్య కవచం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

తుల రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి వృత్తి ఉద్యోగాలలో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాల విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ధన వ్యవహారాలలో ఇబ్బందులు తప్పవు.

పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

వృశ్చిక రాశి: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

ధనస్సు రాశి: పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

పరిహారం : వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

మకర రాశి: ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగయత్నాలు మరింత అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు నూతన గృహ వాహన యోగం ఉన్నది. వ్యాపారాలలో మరింత ప్రగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి. రంగాల వారికి ఉన్నత అవకాశాలు లభిస్తాయి వారం చివరిలో కుటుంబంలో సమస్యలు ఉంటాయి.

పరిహారం : నవగ్రహ ధ్యాన శ్లోకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

కుంభ రాశి: నూతన పనులు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి ధన పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

పరిహారం : లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

మీన రాశి: అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. వాహన అనుకూలత కలుగుతుంది సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు వ్యాపారాలు ఆశించిన విధంగా విస్తరిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. రాజకీయ ప్రముఖులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి

పరిహారం : లక్ష్మీ నరసింహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

Next Story