వార ఫ‌లాలు 16-01-2022 నుంచి 22-01-2022 వరకు

Astrology from January 16th to 22nd.వార ఫ‌లాలు 16-01-2022 నుంచి 22-01-2022 వరకు

By జ్యోత్స్న  Published on  16 Jan 2022 2:51 AM GMT
వార ఫ‌లాలు 16-01-2022 నుంచి 22-01-2022 వరకు

మేషరాశి : చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలలో అవాంతరాలు తప్పవు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో ఊహించని విభేదాలు నెలకొంటాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులు కష్టానికి తగిన ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలనాలుంటాయి. చిన్నతరహా పరిశ్రమల ప్రయత్నాలు ఫలించవు. కొన్ని రంగాల వారికి ఊహించని సమస్యలు ఉంటాయి వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

పరిహారం : శ్రీరామరక్షాస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి : చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలుకు సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. ఇంటా బయట అందరిని ఒక మాటమీదకు తీసుకువస్తారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అన్ని రంగాల వారికీ ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వృధా ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో చికాకులు తప్పవు

పరిహారం : విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి : ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు దైవ సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వారం మధ్యలో ఒక సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజి చేసుకుంటారు భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మీ సమర్థత చాటుకుంటారు. చిన్నతరహా పరిశ్రమల వారు సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.

పరిహారం : శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి : చేపట్టిన పనులలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెద్దల సహాయంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగమున ఒక సమస్య నుంచి తెలివిగా బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధువులతో స్వల్ప వివాదాలు తప్పవు.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

సింహ రాశి : ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి ఆత్మీయులతో అకారణ విభేదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.వారం చివరిలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

పరిహారం : గణేష అష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

కన్య రాశి : చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దాయదులతో స్థిరాస్తి వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు కొంత నిదానిస్తాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా పడతాయి. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో చిన్న పాటి అవరోధాలు తప్పవు. నూతన రుణయత్నాలు సాగిస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారము ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలను మధ్యలో విరమిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. వారం ప్రారంభంలో చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల రాశి: కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగు పడుతాయి. విద్యార్థులకు శుభ వార్తలు అందుతాయి. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట అందరిని ఒక మాట మీదకు తీసుకు వస్తారు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.

పరిహారం : సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. ఆత్మీయుల నుంచి అందిన సమాచారంతో ఊరట చెందుతారు. నూతన పరిచయాలతో మరింత సంతోషాన్ని ఇస్తాయి. ఆర్థిక లావాదేవీలు అక్రమంగా మెరుగుపడతాయి. విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా రాణిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో సోదరులతో కలహా సూచనలున్నవి. ఆస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.

పరిహారం: మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

ధను రాశి: కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు దైవ సేవా కార్యక్రమాలకు విరాళాలు అందిస్తారు.ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరతాయి. భూ, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు సన్నిహితులు సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు చిన్న తరహా పరిశ్రమల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వారం మధ్యలో ఇతరులతో స్వల్ప వివాదాలు తప్పవు మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

మకర రాశి: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. కీలక సమయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సోదరులతో ఆస్తుల వివాదాలు నెలకొంటాయి. బంధుమిత్రుల మాటలు మానసికంగా కలచివేస్తాయి. నిరుద్యోగుల ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు పాత విషయాలు జ్ఞప్తికి వస్తాయి.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొన్ని రంగాల వారికి లభించాల్సిన అవకాశాలు చివరి నిమిషంలో దూరమవుతాయి వారం మధ్యలో ఆత్మీయుల ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి.

పరిహారం : ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

కుంభ రాశి: ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకుల నుండి బయటపడగలుగుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తిచేయగలుగుతారు.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శని అవకాశాలు దక్కుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా ఆగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల విషయంలో శుభవార్తలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలు నూతన లాభాలు అందుకుంటారు. వారం చివరిలో ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.

పరిహారం : మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

మీన రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. సోదరులు, మిత్రులతో మనస్పర్థలు రాజీ చేసుకుంటారు. భూవివాదాలు పరిష్కారదశకు చేర తాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. దైవ సేవాకార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబానికి వ్యవహారాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన విద్యా ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి బయట పడతారు. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల ఫలితాలు ఉంటాయి వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.. ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

పరిహారం : లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు

Next Story