వారఫలాలు 06-02-2022 నుంచి 12-02-2022 వరకు

Astrology from February 6th to 12th.వారఫలాలు 06-02-2022 నుంచి 12-02-2022 వరకు

By జ్యోత్స్న  Published on  6 Feb 2022 2:50 AM GMT
వారఫలాలు 06-02-2022 నుంచి 12-02-2022 వరకు

మేషం రాశి: సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశజానాకంగా ఉంటుంది స్థిరస్తి విషయంలో సోదరులతో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్తులు సహాయంతో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరమైన సమయం. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో మాట పట్టింపు ఉంటాయి.

పరిహారం : శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి: వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంతానం వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో దాయదులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిదికాదు.

పరిహారం : పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

మిథున రాశి: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయట పడతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసి వస్తాయి.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నుండి కొంత ఉపశమనం పొందుతారు. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన సమయం. వారం మధ్యలో ధన పరమైన సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. బంధువర్గం తో విభేదాలు తప్పవు.

పరిహారం : గణనాయకాష్టకం పారాయణ చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి: కుటుంబ సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా మరింత అనుకూలత కలుగుతుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. వ్యాపారులకు విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం చివరన ప్రయాణాలు వాయిదా పడతాయి.ఆర్థిక సమస్యలు కొంత చికాకుపరుస్తాయి.

పరిహారం: గురు చరిత్ర పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి: అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనువు పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలించి లాభలు అందుకుంటారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు చాలకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. గృహనిర్మాణం పనులు వేగవంతం చేస్తారు వృత్తి ఉద్యోగాలలో వివాదాలు సమసిపోతాయి. వారం చివరిలో కొన్ని పనులు సకాలంలో పూర్తి కాకా చికాకులు పెరుగుతాయి. మిత్రులతో ఆకారాణ కలహాలు కలుగుతాయి.

పరిహారం : కనకధారాస్తోత్రాలు పారాయణం చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు.

కన్య రాశి: నిరుద్యోగులకు చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అనుకున్న విధంగా దక్కుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని రంగాల వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

పరిహారం: విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వలన శుభఫలితాలు పొందుతారు.

తుల రాశి: ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజకనంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది.దూరపు బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగమున వివాదం నుండి తెలివిగా బయటపడతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని రంగాల వారికి పరిస్థితులు చక్కబడి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

పరిహారం : లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి: కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలున్నవి. చిన్న తరహా పరిశ్రమలవారు పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధనాదాయం బాగుంటుంది.

పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి: ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయటా సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి మిత్రుల సహాయంతో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో పదోన్నతుల పెరుగుతాయి. గృహ నిర్మాణ ప్రకయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వారం చివరిలో బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి: ముఖ్యమైన పనుల్లో ఆశించిన విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయట విశేషమైన ఆదరణ పెరుగుతుంది ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దాయాదుల తో ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమల వారు నష్టాలునుండి బయటపడి లాభాలు అందుకుంటారు వారం ప్రారంభంలో మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.

పరిహారం: కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి: చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబసభ్యులతో మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతోనూ వివాదాల నుంచి బయటపడగలుగుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

పరిహారం : నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. పాతమిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమల వారి ఆశలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వారం మధ్యలో సోదరులతో స్థిరస్తి వివాదాలు నెలకొంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

పరిహారం : లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Next Story