వారఫలాలు 20-02-2022 నుంచి 26-02-2022 వరకు
Astrology from February 20th to 26th.వారఫలాలు 20-02-2022 నుంచి 26-02-2022 వరకు
By తోట వంశీ కుమార్ Published on 20 Feb 2022 2:00 AM GMTమేషం రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది. గ్రహ సంచారం బాగుందన్న వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు నుండి బయట పడతారు. బంధుమిత్రులు సమాగమం ఆనందం కలిగిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్ విషయంలో కీలక సమాచారం అందుతుంది.
పరిహారం : రాజరాజేశ్వరి దేవి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృషభం రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో అంత అనుకూలత ఉండదు. వృత్తి వ్యాపారాలలో ఊహించని కష్టాలు ఎదురవుతాయి. ఆలోచనా విధానంలో ఆకస్మిక మార్పులు చేయడం వలన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. భూ సంబంధిత వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. ఋణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
పరిహారం : ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
మిథున రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో అంతగా అనుకూలంగా ఉండదు. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం మంచిది.అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణప్రయత్నాలు చేస్తారు.చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా కలచి వేస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
పరిహారం : వజ్రకవచ వెంకటేశ్వర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో అంత అనుకూలంగా ఉండదు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృధా ఖర్చులు చేయిదాటి పోతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. సంతాన పరమైన సమస్యలు వలన మానసిక చికాకులు పెరుగుతాయి. వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపార విషయంలో పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దీర్ఘకాలికఋణఒత్తిడులుపెరుగుతాయి.
పరిహారం: పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
సింహ రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో కూడా అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మంచి మాట తీరుతో ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు. వ్యతిరేకులకు సైతం అవసరానికి సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని సమస్యల నుండి బయటపడతారు. జీవితభాగస్వామితో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో వ్యాపారాలు విస్తరిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి.
పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
కన్య రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది.అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభ వార్తలు అందుతాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. స్థిరస్తి వివాదాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిదికాదు.
పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తుల రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో కూడా అనుకూలంగా ఉంటుంది. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది. సంతాన వివాహాది శుభకార్య ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమునకు బంధుమిత్రులరాక ఆనందం కలిగిస్తుంది. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. ఋణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.
పరిహారం: సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృశ్చిక రాశి:ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఊహించని లాభాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు లోటుండదు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్య అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.
పరిహారం: లక్ష్మీ నృసింహ అష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారంలో ప్రారంభం లో ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలుగుతాయి. చుట్టుప్రక్కల వారితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఋణ పరమైన ఒత్తిడులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి కొన్ని వ్యవహారాలలో కోపాన్ని అదుపులో ఉంచుకుని ముందుకు సాగటం మంచిది. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి.
పరిహారం: రామచంద్ర అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మకర రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో అంతగా అనుకూలంగా ఉండదు. గృహమున కొందరు ప్రవర్తన మానసికంగా చికాకుగా పరుస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. నూతన ఋణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులలో ఒత్తిడి అధికమవుతుంది. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కళత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాలు తప్పవు. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పితృ వర్గీయులతో మాటపట్టింపులు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
పరిహారం: శ్రీ దామోదర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో కూడా అనుకూలంగా ఉండదు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఆరోగ్యం సహకరించక కొన్ని పనులు వాయిదా వేస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులు వియోగం మానసికంగా కొంత కలచివేస్తుంది. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. స్త్రీ సంబంధ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వృత్తి ఉద్యోగాలలో చెయ్యని పనికి నిందలు పడవలసి వస్తుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టి నష్టాలు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
పరిహారం: కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మీన రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. పాత ఋణాలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరు అవుతారు. ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో విజయం సాదిస్తారు. జీవిత భాగస్వామితో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. ధన పరంగా ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు.
పరిహారం : గణపతి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.