వార ఫలాలు 13-02-2022 నుండి 19-02-2022 వరకు
Astrology from February 13th to 19th.వార ఫలాలు 13-02-2022 నుండి 19-02-2022 వరకు
By జ్యోత్స్న Published on 13 Feb 2022 8:20 AM ISTమేష రాశి : ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ధన వ్యవహారాలు అనుకూలిస్తాయి. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఆశించిన స్థానచలనాలు ఉంటాయి.నూతన భూ గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయట సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారం మధ్యలో ఆర్థిక అవరోధాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
పరిహారం : వేణుగోపాల శతకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృషభ రాశి : చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఇంటా బయట సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యయ ప్రయాసలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. బంధువులు, మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్తిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. అన్ని రంగాల వారికి పనులలో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.
పరిహారం : కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
మిథున రాశి : చేపట్టిన పనులు అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలనుండి తెలివిగా బయటపడతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమల ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి
పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కర్కాటక రాశి : మంచి మాట తీరుతో ఇంటాబయట అందరిని ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను పట్టుదలతో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.వ్యాపారాలు గతంకంటే మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి ఊహించని పదోన్నతులు పొందుతారు వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.
పరిహారం : విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
సింహ రాశి : దూరప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో సాగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడులు తొలగుతాయి. సొంత ఆలోచనతో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది వారం మధ్యలో కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. పనులలో ఆటంకాలుంటాయి.
పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
కన్య రాశి : నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.గృహ నిర్మాణ , కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తుల రాశి : చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుంచి బయటపడతారు. స్థిరస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు.వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో సోదరుల తో మాటపట్టింపులుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
పరిహారం : మహాలక్ష్మీ అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి : ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులుంటాయి. దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. వారం మధ్యలో గృహమున ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.స్థిరాస్తులు కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం కలుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులుంటాయి. ఖర్చులు పెరుగుతాయి.
పరిహారం : సూర్యాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ధనస్సు రాశి : ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబసమస్యలు పరిష్కరించుకుంటారు కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంటాబయట నీ మాటకు విలువ పెరుగుతుంది చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు. కొన్ని రంగాల వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో మిత్రులతో కలహా సూచనలున్నవి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
పరిహారం : హయాగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మకర రాశి : ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. బంధువుల నుంచి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పాత విషయాలు మిత్రులతో పంచుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.వారం చివరిలో పనులలో ఆటంకాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
పరిహారం : శివాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
కుంభం రాశి : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాలకు హాజరు అవుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వారం ప్రారంభంలో ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.
పరిహారం : సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మీన రాశి : ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు నుండి బయటపడతారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతాన వివాహం శుభకార్యాల పై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం
పరిహారం : అన్నపూర్ణ అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.