వార ఫలాలు 26-12-2021 నుండి 01-01-2022 వరకు

Astrology from December 26th January 1st.వార ఫలాలు 26-12-2021 నుండి 01-01-2022 వరకు

By జ్యోత్స్న  Published on  26 Dec 2021 2:39 AM GMT
వార ఫలాలు 26-12-2021 నుండి 01-01-2022 వరకు

మేషరాశి : నూతనోత్సాహంతో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు . నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం. కొన్ని విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పుణ్య క్షేత్రములు సందర్శిస్తారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అప్రయత్నంగా అవకాశములు అందుతాయి. వారం ప్రారంభంలో చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు. స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి : ఆర్థిక పరిస్థితి క్రమ క్రమంగా మెరుగుపడుతుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. అందుతాయి విలువైన వస్తులాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. సంఘంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఆనందం కలిగిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. వారం చివరిలో వృధాఖర్చులు. కుటుంబంలో అకారణ వివాదాలు తప్పవు.

పరిహారం : విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి : నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. తెలివిగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. దాయాదులతో వివాదాలు పరిష్కారమౌతాయి.విద్యార్థులు అంచనాలు అందుకుంటారు నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి ఉద్యోగాలలో విధులు ఉత్సాహంగా నిర్వర్తిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి విభేదాలు.

పరిహారం : శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల చేయూతతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలులో ముందడుగు వేస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. గులాబీ, తెలుపు రంగులు.

పరిహారం : ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహ రాశి : ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.ఇంటాబయట ఒత్తిడులు తప్పవు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పాతసంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త అవసరం విద్యార్థులు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి కొన్ని రంగాల వారికి చిక్కులు తప్పవు వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నూతన వాహన యోగం ఉన్నది.

పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కన్య రాశి : చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు నూతన అవకాశములు అందుతాయి. వారం చివరిలో ఆర్ధిక ఇబ్బందులు తప్పవు . మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులుంటాయి.

పరిహారం : దేవిఖడ్గమాలా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల రాశి :ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మిత్రులు సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి వారం ప్రారంభంలో పనులలో శ్రమ అధికమౌతుంది స్వల్ప అనారోగ్య సూచనలు.

పరిహారం : గురుచరిత్ర పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి ప్రయణాలలో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వారం చివరిలో మిత్రులతో కలహా సూచనలున్నవి ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.

పరిహారం: సుబ్రహ్మణ్యష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి : నూతన పనులకు శ్రీకారం చుడతారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో ఎంతటి వారినైనా మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు.స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది, చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో ఊహించని ఖర్చులు పెరుగుతాయి. బందువులతో స్వల్ప విభేదాలు తప్పవు.

పరిహారం: ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి : చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి అందిన కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహ వాహన కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలిస్తాయి వ్యాపారాలలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు . అన్ని రంగాల వారికి నూతన అవకాశములు దక్కుతాయి. వారం ప్రారంభంలో పనులలో వ్యయప్రయాసలు తప్పవు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.

పరిహారం : కనకధారా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఇంటా బయట బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.ఇంటా బయట సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి తొలగుతుంది అన్ని వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప ధన వ్యయ సూచనలున్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పవు. మిత్రులతో అకారణ కలహ సూచనలున్నవి.

పరిహారం: మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయించాలి.

మీన రాశి : చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులు కష్టం ఫలిస్తుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలున్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు . అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. గృహమున వివాదాలు తప్పవు.

పరిహారం : మధురాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

Next Story