వార ఫలాలు 12-12-2021 నుండి 18-12-2021 వరకు
Astrology from December 12th to 18th.వార ఫలాలు 12-12-2021 నుండి 18-12-2021 వరకు
By జ్యోత్స్న Published on 12 Dec 2021 8:21 AM ISTమేష రాశి: చేపట్టిన ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగు పడుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారంలో స్వంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది.మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు నుండి ఉపశమనం పొందుతారు. చిన్నతరహా పరిశ్రమలకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు తప్పవు.
పరిహారం : విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
వృషభ రాశి: దీర్ఘ కాలిక ఋణవిముక్తి కోసం చేసే ప్రయత్నాలు కొంత సఫలమవుతాయి. చాలాకాలంగా వేదిస్తున్న సమస్యలు తొలగుతాయి. అవసరాలకు తగినంత సొమ్ము చేతికి అందుతుంది. చేపట్టిన పనులు కష్టసాధ్యమైనా ఎవరి సహాయం లేకుండా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగమున మంచి పని తీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. నూతన వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వారం మధ్యలో ధనపరంగా సమస్యలు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి.
పరిహారం : గణేశాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
మిథున రాశి: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. దైవ సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇంటా బయట పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు రాజి చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. దూరప్రాంతాల ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. సంతాన ఉన్నత విద్యా యత్నాలు సఫలమవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు లాభల బాటలో సాగుతాయి. ఉద్యోగం విషయంలో ఆశించిన అవకాశాలు పొందుతారు. అన్ని రంగాల వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. స్వల్ప ఆరోగ్యసమస్యలు ఉంటాయి.
పరిహారం : ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కర్కాటక రాశి: శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట పొందుతారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధు మిత్రుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ వాతవరణం కొంత చికాకు పరుస్తుంది.
పరిహారం : దత్త పంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
సింహ రాశి: కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. అధికారుల నుండి అందిన సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. గృహమున మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో అనుకోని విధంగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో సోదరులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు.
పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కన్య రాశి: దూరపు బంధువుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించు కొంటారు చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి వారం ప్రారంభంలో పనులలో ఆటంకాలు తప్పవు. సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.
పరిహారం : రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
తుల రాశి: ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. నూతన ఋణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల కష్టం ఫలించింది నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నిర్ణయాలు సకాలంలో తీసుకుని లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ముఖ్య వ్యవహారాలలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయట పడతారు. అన్ని రంగాల వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి వారం చివరిలో బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి.
పరిహారం : హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
వృశ్చిక రాశి: కొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయట పరిస్థితులు చక్కబడతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపార ఉద్యోగాలలోఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులతో జతగా వ్యవహరిస్తారు. అన్ని రంగాల వారి ప్రయత్నాలు ఫలించే సమయం. వారం చివరిలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.
పరిహారం : సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ధనస్సు రాశి: మంచి ఆలోచనా విధానంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా తాగుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు.
పరిహారం : దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మకర రాశి: నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు విద్యా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. గృహ నిర్మాణయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. దూరపు మిత్రుల నుండి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలలో లాభాలు ఎందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ధనం పరంగా ఇబ్బందులు తప్పవు.
పరిహారం : ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
కుంభ రాశి: ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నూతన కాంట్రాక్టులు అందుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామిక వర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి మిత్రుల నుంచి ధన ఒత్తిడులు ఉంటాయి.
పరిహారం : మేధో దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
మీన రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు నుండి బయట పడతారు. స్థిరస్తి కొనుగోలుకు, అవరోధాలు తొలగుతాయి వాహన కొనుగోలుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపారాల విస్తరణ సాఫీగా సాగుతుంది. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో గృహమున వివాదములు. వృధా ఖర్చులు పెరుగుతాయి.
పరిహారం : కనకధార స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.